ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral video: ఆవిరి రైలుతో యువతి సెల్ఫీ వీడియో.. అంతా చూస్తుండగానే.. చివరకు..

ABN, Publish Date - Jun 06 , 2024 | 08:55 PM

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో యువత లైక్‌‌లు, వ్యూస్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వినూత్న ప్రయోగాలు చేస్తుంటే.. మరికొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల...

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో యువత లైక్‌‌లు, వ్యూస్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వినూత్న ప్రయోగాలు చేస్తుంటే.. మరికొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల మహిళలు కూడా సెల్ఫీల పిచ్చిలో పడిపోయి ప్రమాదాలకు గురవడం చూస్తున్నాం. ఇలాంటి విషాదకర ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆవిరి రైలుతో సెల్ఫీ దిగాలని ఓ యువతి ప్రయత్నించింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) వైరల్ అవుతోంది. మెక్సికోలోని (Mexico) హిడాల్గోలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల ఆ ప్రాంతంలో రైల్వే అధికారులు.. ఆవిరితో నడిచే రైలును (steam powered train) ప్రారంభించారు. ఈ రైలు చూసేందుకు పాత కాలం నాటి రైలులా ఉండడంతో పాటూ ఆవిరితో నడవనుండడంతో ఎలా ఉంటుందో చూడాలని జనం అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో చాలా మంది రైలు పట్టాలకు అటూ, ఇటూ నిలబడి ఫోన్ కెమెరాలు ఆన్ చేసి పెట్టుకున్నారు. ఇంతలో ఆవిరితో నడిచే రైలు కూత పెడుతూ అటుగా వచ్చింది.

Viral video: గేదె మెడలో దండ వేసి పెళ్లి చేసుకున్నాడు.. ఆ వెంటనే అతడు చేసిన నిర్వాకంతో..


రైలు సమీపానికి రావడం చూసి అక్కడున్న వారంతా వీడియోలు, ఫొటోలు తీసుకోవడం మొదలెట్టారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ యువతి.. మరింత దగ్గరగా వీడియో తీసుకోవాలనే ఉద్దేశంతో పట్టాల సమీపానికి వెళ్లింది. రైలు దగ్గరగా వచ్చే సమయంలో మోకాళ్లపై నిల్చుని రైలును వీడియో తీస్తూ ఉంది. ఈ క్రమంలో వేగంగా వచ్చిన రైలు ఆమెను (train hit the young woman) ఢీకొని వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఆమె కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి పరుగుపరుగున అక్కడికి వెళ్లి ఆమెను పైకి లేపే ప్రయత్నం చేస్తాడు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో అక్కడే ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Optical illusion: ఈ రెండు చిత్రాల్లోని 5 తేడాలను గుర్తించడం మీకు సాధ్యమేనా..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదిలావుండగా, ఈ ఘటనపై నెనడియన్ పసిఫిక్ కాన్సాస్ సిటీ విభాగం అధికారులు స్పందించారు. రైలు ప్రమాదంలో మహిళ చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి సాహసాలు ఎవరూ చేయొద్దని, రైలు పట్టాలకు కనీసం 10 మీటర్ల దూరం పాటించాలని సూచించారు. ఈ ప్రమాద వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అయ్యో.. పాపం..! ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సాహసాలు ఎవరూ చేయొద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.40లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: సింహాల మధ్యలోకి రాయల్‌‌‌గా ఎంట్రీ ఇచ్చాడు.. చివరకు ఏమైందో మీరే చూడండి..

Updated Date - Jun 06 , 2024 | 08:55 PM

Advertising
Advertising