ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral video: కారు ఢీకొనడంతో ఎగిరి దూరంగా పడ్డ యువతి.. చివరకు ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

ABN, Publish Date - Jun 13 , 2024 | 09:01 PM

నిర్లక్ష్యంగా కొందరు, తొందరపాటు కారణంగా మరికొందరు రోడ్డు ప్రమాదాలకు గురవుతుంటారు. రోడ్డు దాటే సమయాల్లో చాలా మంది ప్రమాదాలకు గురవడం చూస్తుంటాం. అయితే ఇలాంటి..

నిర్లక్ష్యంగా కొందరు, తొందరపాటు కారణంగా మరికొందరు రోడ్డు ప్రమాదాలకు గురవుతుంటారు. రోడ్డు దాటే సమయాల్లో చాలా మంది ప్రమాదాలకు గురవడం చూస్తుంటాం. అయితే ఇలాంటి సమయాల్లో అప్పుడప్పుడూ మిరాకిల్ జరుగుతుంటుంది. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కారు ఢీకొనడంతో ఓ యువతి ఎగిరి దూరంగా పడింది. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఔబెదుల్లాగంజ్ పరిధి అర్జున్ నగర్ బ్రిడ్జి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి తన స్నేహితులతో కలిసి బ్రిడ్జి కింద మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఏమైందో ఏమో గానీ ఒక్కసారిగా ఆమె రోడ్డు పైకి పరుగెత్తుకుంటూ వస్తుంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కారు.. ఆమెను (car hit the young woman) ఢీకొంటుంది. దీంతో ఆమె దూరంగా ఎగిరిపడుతుంది. ఈ ఘటనతో యువతి స్నేహితులంతా అక్కడికి పరుగెత్తుకుంటూ వస్తారు. రోడ్డుపై పడిపోయిన బాలికను చూసి కారు డ్రైవర్ కిందకు దిగే ప్రయత్నం చేస్తాడు. అయితే అప్పటికే ఆవేశంగా యువతి స్నేహితులను చూసి భయంతో కారు ఆపకుండా వెళ్లిపోతాడు.

Viral video: రైలు పట్టాలపై షాకింగ్ సీన్.. పట్టాల మధ్యలో ఇరుక్కుపోయిన రిక్షా.. క్షణాల వ్యవధిలో..


ఈ క్రమంలో రోడ్డుపై పడ్డ బాలికను తొక్కించుకుంటూ వెళ్తాడు. తర్వాత అంతా కలిసి బాలికను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో ఆశ్చర్యకరంగా స్వల్పగాయాలతో బయటపడింది. యువతికి ఏమీ కాలేదని తెలిసి అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇందులో యువతిదే తప్పు’’.. అంటూ కొందరు, ‘‘రోడ్డు దాటేటప్పుడు వాహనాలను చూసుకుంటూ జాగ్రత్తగా దాటాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.70లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Women: యువతి పిలవడంతో స్నేహితులతో కలిసి వెళ్లిన యువకుడు.. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత..

Updated Date - Jun 13 , 2024 | 09:01 PM

Advertising
Advertising