ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఇది సినిమా స్టంట్ అనుకుంటే పొరపాటే.. రన్నింగ్ లారీ పైకి ఎక్కిన యువకులు.. చివరకు..

ABN, Publish Date - May 25 , 2024 | 08:10 PM

కొన్నిసార్లు సినిమా తరహా సీన్లు నిజ జీవితంలోనూ చోటు చేసుకుంటుంటాయి. మరికొన్నిసార్లు సినిమా సీన్లను తలదన్నే ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ...

కొన్నిసార్లు సినిమా తరహా సీన్లు నిజ జీవితంలోనూ చోటు చేసుకుంటుంటాయి. మరికొన్నిసార్లు సినిమా సీన్లను తలదన్నే ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రన్నింగ్ లారీ పైకి ఎక్కిన ఇద్దరు యువకులు చేసిన పని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంతకీ వీళ్లు చేసిన నిర్వాకం ఏంటో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) షాజాపూర్ జిల్లా అగర్-ముంబై జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ లారీ ఎత్తైన లోడుతో వేగంగా వెళ్తోంది. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు పక్కా పథకం ప్రకారం లారీని ఫాలో అయ్యారు. వారిలో ఇద్దరు యువకులు రన్నింగ్ లారీని సునాయాసంగా ఎక్కేశారు. పైకి ఎక్కి టార్పాలిన్ కవర్‌ను కట్ చేసి, లోపలి ఉన్న సరుకులకు సంబంధించిన పెద్ద బాక్సును బయటికి తీశారు.

Viral Video: వామ్మో..! వంట గదిలో ఈ రోబో చేసిన పని చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..


తర్వాత దాన్ని లారీ పైనుంచే కింద పడేశారు. ఆ తర్వాత వెనుక లారీని బైకులో ఫాలో అవుతూ వస్తున్న మూడో వ్యక్తి లారీ సమీపానికి వెళ్లాడు. దీంతో లారీ పైన ఉన్న వారు ఎంతో చాకచక్యంగా రన్నింగ్ బైకుపైకి దిగారు. చివరకు బైకును స్లో చేసి, కిందపడేసిన బాక్సును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనను మొత్తం వారి వెనుకే వస్తు్న్న వాహనదారులు వీడియో తీశారు. ఇదిలావుండగా, చోరీ విషయం ఆలస్యంగా తెలుసుకున్న లారీ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Viral Video: ఈ వధువు చాలా స్మార్ట్ గురూ..! చుట్టూ అంతా ఉన్నా.. వరుడిని బురిడీ కొట్టించిందిగా..


ఈ ఘటనలపై లారీ డ్రవర్లు అంతా కలిసి జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఆగ్రా-ముంబై జాతీయ రహదారిపై నైనావాడ్ లోయలో తరచూ ఇలాంటి చోరీలు చోటు చేసుకుంటున్నాయని, ఎన్నిసార్లు విన్నవించినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. సమాచాం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా, చోరీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: జలకాలాడుతున్న యువతిని చూసి జడుసుకుంటున్న జనం.. ఇంతకీ ఈమె చేసిన పనేంటంటే..

Updated Date - May 25 , 2024 | 08:10 PM

Advertising
Advertising