ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పార్సిల్‌తో రోడ్డుపైకి వచ్చిన డెలివరీ బాయ్.. ఆర్డర్ చేసిన వ్యక్తిపై నెటిజన్ల ఆగ్రహం.. అసలేం జరిగిందంటే..

ABN, Publish Date - Sep 08 , 2024 | 07:12 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రధాన రహాదారిపై వాహనాలన్నీ ఆగిపోయాయి. మరో వైపు వర్షం కురుస్తోంది. ఈ సమయంలో ఆటోలో ఉన్న వారు ఎదురుగా డెలివరీ బాయ్‌ను చూసి అవాక్కయ్యారు. జొమాటో దుస్తులు ధరించిన ఓ యువకుడు చేతిలో..

ప్రస్తుత సమాజంలో సమాజంలో ఏది తినాలన్నా.. ఏ వస్తువు కావాలన్నా.. ఒక్క క్లిక్‌తో మన వద్దకే వచ్చే వెసులుబాటు ఉంది. అయితే ఇందులోనూ కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తుంటాయి. కొన్నిసార్లు ఆర్డర్ పెట్టినది కాకుండా వేరే ఏవేవో వస్తువులు రావడం, అనుకున్న టైమ్‌‌కి కాకుండా ఆలస్యంగా రావడం వంటి ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్ల ఆర్డర్ పెట్టిన వారికి ఇబ్బందులు ఎదురైతే.. మరికొన్నిసార్లు పార్సిల్ తీసుకొస్తున్న వాళ్లకు షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ డెలివరీ బాయ్ పార్సిల్‌తో కలిసి రోడ్డు పైకి వచ్చాడు. ఇతన్ని చూసి ఆర్డర్ పెట్టిన వ్యక్తిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఢిల్లీలోని (Delhi) గుర్గావ్-మెహ్రౌలీ రోడ్‌‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రధాన రహాదారిపై వాహనాలన్నీ ఆగిపోయాయి. మరో వైపు వర్షం కురుస్తోంది. ఈ సమయంలో ఆటోలో ఉన్న వారు ఎదురుగా డెలివరీ బాయ్‌ను (Zomato Delivery Boy) చూసి అవాక్కయ్యారు. జొమాటో దుస్తులు ధరించిన ఓ యువకుడు చేతిలో ఓ పార్సిల్ బాక్స్ పట్టుకుని, వర్షంలోనే అటూ ఇటూ తిరుగుతున్నాడు.

Viral Video: వామ్మో.. ఇదేం స్టంట్‌రా బాబోయ్.. ఫ్రెండ్‌ని ఫ్యాన్ రెక్కలా మార్చి మరీ..


ఫుడ్ ఆర్డర్ చేసిన వ్యక్తికి కాల్ చేస్తూ కంగారుగా తిరుగుతున్నాడు. అయినా ఫుడ్ ఆర్డర్ చేసిన వారు ఆ చుట్టు పక్కల కనిపించలేదు. రోడ్డుపై వాహనాలన్నీ ఆగిపోగా.. ఆ వ్యక్తి వాహనాల మధ్యలో నుంచి అటూ, ఇటూ తిరుగుతూ ఉండడం చూసి అంతా అయ్యో.. పాపం.. అని సానుభూతి వ్యక్తం చేశారు. మరికొందరు ఈ వర్షంలో ఫుడ్ ఆర్డర్ చేయడమే కాకుండా.. సమయానికి కనిపించకుండా పోవడం ఏంటని మండిపడ్డారు.

Viral Video: గణేశ్ విగ్రహాన్ని ఇలా తీసుకురావడం ఎక్కడైనా చూశారా.. ఇతను చేసిన స్టంట్ చూస్తే..


అక్కడే ఆటోలో కూర్చున్న వారు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇంత వర్షంలోనూ సమయానికి ఆర్డర్ పట్టుకొచ్చిన ఇతడికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే’’.. అంటూ కొందరు, ‘‘ఫుడ్ ఆర్డర్ చేసి, అందుబాటులో లేకపోవడం దారుణం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: కుక్కల నుంచి తప్పించుకునే క్రమంలో.. చివరకు ఇతడు చేసిన నిర్వాకం..


ఇవి కూడా చదవండి..

Viral Video: మందు కొడుతుండగా నాగు పాము ఎంట్రీ.. చేతిలోకి తీసుకుని అతడు చేసిన నిర్వాకం చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 08 , 2024 | 07:12 PM

Advertising
Advertising