Share News

57 ఏళ్ల తర్వాత..

ABN , Publish Date - Dec 15 , 2024 | 02:30 AM

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఏకంగా 57 ఏళ్ల తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌లో సంతోష్‌ ట్రోఫీ.. అవును సుదీర్ఘ విరామానంతరం ఈ ప్రతిష్ఠాత్మక ఫుట్‌బాల్‌ టోర్నీకి నగరం వేదికగా...

57 ఏళ్ల తర్వాత..

హైదరాబాద్‌లో మొదలైన సంతోష్‌ ట్రోఫీ పోటీలు

హైదరాబాద్‌: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఏకంగా 57 ఏళ్ల తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌లో సంతోష్‌ ట్రోఫీ.. అవును సుదీర్ఘ విరామానంతరం ఈ ప్రతిష్ఠాత్మక ఫుట్‌బాల్‌ టోర్నీకి నగరం వేదికగా నిలిచింది. అజీజ్‌ నగర్‌లోని శ్రీనిధి ఫుట్‌బాల్‌ క్లబ్‌లో శనివారం ఈ పోటీలు మొదలయ్యాయి. ప్రారంభ మ్యాచ్‌లో మణిపూర్‌ 1-0తో సర్వీసె్‌సపై గెలిచింది. ఇక, ఆతిథ్య తెలంగాణ తన పోరును డ్రాతో ప్రారంభించింది. రాజస్థాన్‌తో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది. కాగా, ఈనెల 29న సెమీఫైనల్స్‌, 31న ఫైనల్‌ మ్యాచ్‌లకు గచ్చిబౌలి స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. తెలంగాణ క్రీడాప్రాథికార సంస్థ (శాట్‌) చైర్మన్‌ శివసేనా రెడ్డి టోర్నీని ప్రారంభించారు.

Updated Date - Dec 15 , 2024 | 02:30 AM