Minister: నేను బెయిల్ నిబంధనలు ఉల్లంఘించలేదు..
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:00 PM
తాను బెయిల్ నిబంధనలు ఉల్లంఘించలేదు, అలాగే.. మంత్రి పదవిలో కూడా కొనసాగే హక్కు నాకుందని రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీ పేర్కొన్నారు. అలాగే.. ఆయన సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.

- మంత్రి పదవిలో కొనసాగే హక్కుంది
- సుప్రీంకోర్టుకు మంత్రి సెంథిల్ బాలాజీ వివరణ
చెన్నై: మనీల్యాండరింగ్ కేసులో న్యాయస్థానం తనకు మంజూరు చేసిన బెయిల్ నిబంధనలను ఉల్లంఘించలేదని, మంత్రి పదవిలోసాగే హక్కు తనకుందని రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీ(Minister Senthil Balaji) సుప్రీంకోర్టుకు వివరించారు. ఈ మేరకు ఆయన బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో రవాణా శాఖ మంత్రిగా వ్యవహరించిన సమయంలో ఆ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురి నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశారని అందిన ఫిర్యాదుల ఆధారంగా సెంథిల్ బాలాజీని 2023 జూన్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Exam Paper Evaluation: ఇక ఆ పిల్లలు పాసైనట్లే.. ఫ్యూన్‌తో పేపర్ కరెక్షన్..
దాదాపు 470 రోజులకు పైగా ఖైదీగా వున్న సెంథిల్ బాలాజి తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పలుమార్లు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఆయన ఖైదీగా ఉన్నందువల్ల ప్రస్తుత డీఎంకే మంత్రివర్గంలో శాఖలేని మంత్రిగా కొనసాగుతారని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. బెయిల్ పొందేందుకు మంత్రి పదవి అడ్డుగా ఉందని భావించిన సెంథిల్ బాలాజి గత ఏడాది ఫిబ్రవరిలో పదవికి రాజీనామా చేశారు. సెంథిల్ బాలాజి బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, 2024 సెప్టెంబర్‌లో బెయిల్‌ను మంజూరు చేసింది.
దీంతో ఆయన సెప్టెంబర్ 26న జైలు నుంచి విడుదలైన 3వ రోజున, అంటే 29న మళ్లీమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో సెంథిల్ బాలాజి మళ్ళీ మంత్రిగా ఉన్నందువల్ల ఆయనకు సంబంధించిన మనీల్యాండరింగ్ కేసు విచారణ సక్రమంగా జరగడంలేదని, సాక్షులను బెదిరిస్తున్నారని, అందువల్ల ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని విద్యాకుమార్ అనే వ్యక్తి గత ఏడాది నవంబరులో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అభయ్ ఎస్.ఒగా, ఆశ్విన్ జార్జ్‌లతో కూడిన ధర్మాసనం ఈ విచారణను 2025 ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేస్తూ.. మంత్రిగా కొనసాగే హక్కుందా అని సెంథిల్ బాలాజీని ప్రశ్నించింది. దీనిపై సెంథిల్ బాలాజి సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చారు. తాను బెయిల్ నిబంధనలను ఉల్లంచినట్లు తానంటే గిట్టని వ్యక్తి దాఖలు చేసిన పిటిషనలో వాస్తవాలు లేవని, తాను మంత్రి హోదాలో కోర్టు ఉత్తర్వులను అతిక్రమించలేదని తన కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Greenfield Expressway: హైదరాబాద్-అమరావతి.. గ్రీన్‌ఫీల్డ్ హైవే
CM Revanth Reddy: బ్రిటిష్ వారి కంటే బీజేపీ నేతలు ప్రమాదకారులు
Hyderabad: ఫోన్‌లో మాట్లాడవద్దన్నందుకు.. ఆ బాలిక ఏం చేసిందో తెలిస్తే..
Read Latest Telangana News and National News