Shubman Gill: దమ్ముంటే రండి చూస్కుందాం.. గిల్ మాస్ వార్నింగ్
ABN , Publish Date - Apr 10 , 2025 | 11:39 AM
GT vs RR: గుజరాత్ టైటాన్స్ జట్టు సారథి శుబ్‌మన్ గిల్ ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపిస్తున్నాడు. తమ జోలికస్తే వదలబోమని వార్నింగ్ ఇస్తున్నాడు. అయితే ఇది మొదటికే మోసం తెచ్చే ప్రమాదం ఉందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

ఐపీఎల్-2025 ఆరంభానికి ముందు గుజరాత్ టైటాన్స్‌పై పెద్దగా ఆశల్లేవు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్, జోస్ బట్లర్ లాంటి ఇద్దరు, ముగ్గురు తప్పితే స్క్వాడ్‌లో తోపు బ్యాటర్లు లేరు. బౌలింగ్‌లోనూ రషీద్ ఖాన్, మహ్మద్ సిరాజ్ తప్పితే పేరున్న స్టార్లు లేరు. దీంతో ఈ టీమ్ ప్లేఆఫ్స్ చేరడం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ గుజరాత్ మ్యాచ్ మ్యాచ్‌కూ మెరుగుపడుతూ.. పాయింట్స్ టేబుల్‌లో టాప్ ర్యాంక్‌కు దూసుకొచ్చింది. వరుస విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఉన్న వనరులను అద్భుతంగా వినియోగించుకుంటూ టాప్ టీమ్స్‌కు షాక్ ఇస్తూ రచ్చ చేస్తోంది జీటీ. ఈ నేపథ్యంలో ఆ జట్టు సారథి శుబ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమను తక్కువ అంచనా వేయొద్దంటూ ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశాడు. అతడు ఇంకా ఏమన్నాడంటే..
కొట్టిపారేస్తాం
రాజస్థాన్ రాయల్స్‌తో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా బుధవారం జరిగిన కీలక పోరులో గుజరాత్ గెలిచింది. 58 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో మ్యాచ్ అనంతరం గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మంచి టార్గెట్ సెట్ చేశామని.. మొదటి 3 నుంచి 4 ఓవర్లలో బ్యాటింగ్ చేయడం కష్టమైందన్నాడు. సాయి సుదర్శన్, జోస్ బట్లర్ ఆడిన తీరు అద్భుతమని మెచ్చుకున్నాడు జీటీ సారథి. ప్రత్యర్థుల నుంచి ఎంతటి సవాల్‌కైనా సిద్ధమని అన్నాడు గిల్. ఏ రోజైనా సరే 220 బాదేయడానికి తాము సిద్ధమంటూ అపోజిషన్ టీమ్స్‌కు వార్నింగ్ ఇచ్చాడు.
ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరమా..
బ్యాటింగ్ యూనిట్‌లో డెప్త్ లేకపోవడంతో గుజరాత్‌కు ఈసారి కష్టమేనని భారీగా విమర్శలు వచ్చాయి. బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకున్నాడో ఏమో.. ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చాడు గిల్. రండి చూస్కుందాం.. 220 కొట్టమంటారా.. తాము రెడీ అంటూ సవాల్ విసిరాడు. తమ దగ్గర అద్భుతమైన ఫాస్ట్ బౌలర్లు ఉన్నారని, తాము బాగా బ్యాటింగ్ చేస్తే చాలు.. మిగతా కథ వాళ్లు ముగిస్తారని గిల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే శుబ్‌మన్.. ఇంత ఓవర్‌కాన్ఫిడెన్స్ వద్దు, మొదటికే మోసం వచ్చే డేంజర్ ఉందని కొందరు నెటిజన్స్ సూచిస్తున్నారు. అతివిశ్వాసం మంచిది కాదని.. అది టీమ్ కొంపముంచుతుందని హెచ్చరిస్తున్నారు.
ఇవీ చదవండి:
ఒలింపిక్స్‌లో క్రికెట్.. ఆ జట్లకే చాన్స్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి