Police Case: వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు.. టీడీపీ కార్యకర్త సస్పెండ్..
ABN , Publish Date - Apr 10 , 2025 | 11:58 AM
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై తెలుగుదేశం అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ.. కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు (YSRCP president), మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి (Ex CM Jagan) సతీమణి వైఎస్ భారతి (YS Bharati) పై అసభ్యకర వ్యాఖ్యలు (Comments) చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త (TDP Activist) చేబ్రోలు కిరణ్ (Chebrolu Kiran)పై టీడీపీ అధిష్టానం (Telugu Desam Party) ఆగ్రహం (Fire) వ్యక్తం చేసింది. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అతనిపై కేసు పెట్టి అరెస్టు చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అధిష్టానం ఆదేశాలతో పోలీసులు కిరణ్‌పై కేసు (Police Case) నమోదు చేశారు. గురువారం, గుంటూరులో కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. మరోవైపు క్షణికావేశంలో అలాంటి వ్యాఖ్యలు చేశానని తనను క్షమించాలని కిరణ్ కోరారు.
Also Read..: కాకాణీకి లుక్ అవుట్ నోటీసులు..
కాగా ఏపీ రాజకీయాల్లో మరో వివాదం రాజుకుంది. టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్.. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన తప్పును గుర్తించిన చేబ్రోలు కిరణ్ తర్వాత ఓ వీడియో విడుదల చేసి క్షమాపణలు కారారు. “నా మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించమని కోరుతున్నాను. ఎలాంటి ఉద్దేశంతో తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని.. క్షణికావేశంలో చేశారని క్షమించండి” అంటూ వీడియో విడుదల చేశారు. అయినా సమస్య సద్దుమణగలేదు. ఈ వ్యాఖ్యలు స్త్రీల పట్ల అగౌరవంగా ఉన్నాయని, రాజకీయ సంస్కృతికి తగని విధంగా ఉన్నాయని వైసీపీ నాయకులు ఆరోపిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కిరణ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే గతంలో వైసీపీ నేత వల్లభనేని వంశీ, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భవనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటన కూడా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వంశీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు చేబ్రోలు కిరణ్ వ్యాఖ్యలతో టీడీపీ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఇలాంటి సంఘటనలు ఆయా పార్టీల ఇమేజ్‌ను దెబ్బతీస్తాయి. దీంతో టీడీపీ అధిష్టానం కిరణ్‌పై చర్యలు తీసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Online Betting Games.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం..
శాంతి చర్చలపై మావోయిస్టు పార్టీ తాజా స్పందన
For More AP News and Telugu News