Share News

Sachin: నా చిన్ననాటి కల 13 ఏళ్ల క్రితం నెరవేరింది.. సచిన్ ఆసక్తికర ట్వీట్

ABN , Publish Date - Apr 02 , 2024 | 03:09 PM

టీమిండియా రెండో సారి వన్డే ప్రపంచకప్ గెలిచి నేటికి సరిగ్గా 13 ఏళ్లు పూర్తయ్యాయి. 2011 ఏప్రిల్ 2న అంటే 13 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున భారత జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచింది. తద్వారా 28 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత భారత జట్టు రెండోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది.

Sachin: నా చిన్ననాటి కల 13 ఏళ్ల క్రితం నెరవేరింది.. సచిన్ ఆసక్తికర ట్వీట్

టీమిండియా రెండో సారి వన్డే ప్రపంచకప్ (World Cup 2011) గెలిచి నేటికి సరిగ్గా 13 ఏళ్లు పూర్తయ్యాయి. 2011 ఏప్రిల్ 2న అంటే 13 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున భారత జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచింది. తద్వారా 28 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత భారత జట్టు రెండోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించి ప్రపంచకప్‌ను అందుకుంది. ఆ ప్రపంచకప్ విజయం ఇప్పటికీ భారత క్రికెట్ అభిమానుల కళ్ల ముందు కదలాడుతునే ఉంది. ఆ ప్రపంచకప్ విజయంతో కోట్లాది అభిమానులతోపాటు నాటి జట్టులో సభ్యుడైన భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) కల నెరవేరింది. ప్రపంచకప్ గెలవాలని చిన్న నాటి నుంచి సచిన్ కన్న కల ఆ రోజు నిజమైంది. దీంతో ఆ రోజు ప్రపంచకప్ గెలిచాక సచిన్‌తోపాటు జట్టులోని ఇతర ఆటగాళ్లు, భారతీయుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచి నేటితో సరిగ్గా 13 ఏళ్లు పూర్తయ్యాయి.


ఈ సందర్భంగా తన ఎక్స్ ఖాతా వేదికగా నాటి చిరస్మరణీయ విజయంపై సచిన్ స్పందించాడు. ఆ నాటి అద్భుత క్షణాలను గుర్తు చేసుకున్నాడు. 13 ఏళ్ల క్రితం తన చిన్ననాటి కల నెరవేరిందంటూ భావోద్వేగానికి గురయ్యాడు. నాడు జట్టుకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ‘‘నా చిన్ననాటి కల 13 ఏళ్ల క్రితం నెరవేరింది. నాటి మధుర జ్ఞాపకాలు, జట్టుకు మద్దతుగా నిలిచిన బిలియన్ మందికి పైగా అభిమానులకు ఎప్పటికీ కృతజ్ఞతలు" అని సచిన్ రాసుకొచ్చాడు. కాగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన నాటి ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 274/6 పరుగులు చేసింది. మహేల జయవర్దనే అజేయ సెంచరీతో చెలరేగాడు. అనంతరం లక్ష్యాన్ని భారత జట్టు 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 10 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. ఒకానొక దశలో 31 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయినప్పటికీ గౌతం గంభీర్(Gautam Gambhir), మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) అద్భుత బ్యాటింగ్‌లో టీమిండియా విజయాన్ని అందుకుంది. గంభీర్ 97 పరుగులు చేయగా.. ధోని 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ధోని కొట్టిన విన్నింగ్ సిక్సు క్రికెట్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024: ఐపీఎల్‌లో ఆ రోజు జరగాల్సిన బిగ్ మ్యాచ్‌పై నీలి నీడలు.. ఎందుకంటే..

MI vs RR: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ఆ ఘనత సాధించిన ఒకే ఒక జట్టుగా..

Updated Date - Apr 02 , 2024 | 03:12 PM