Rohit Sharma: రోహిత్ హాఫ్ సెంచరీ.. ఊచకోతకు డిసైడై వచ్చాడుగా..
ABN , Publish Date - Mar 09 , 2025 | 07:32 PM
IND vs NZ Final: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విశ్వరూపం చూపిస్తున్నాడు. న్యూజిలాండ్ బౌలర్లతో అతడు ఆడుకుంటున్నాడు. భారీ షాట్లతో దుబాయ్ స్టేడియాన్ని ఎరుపెక్కిస్తున్నాడు.

చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్‌లో రోహిత్ శర్మ చెలరేగుతున్నాడు. న్యూజిలాండ్ బౌలర్లను చితక బాదుతున్నాడు భారత సారథి. బౌండరీలు, సిక్సులతో ప్రత్యర్థులను ఊచకోత కోస్తున్నాడు. 41 బంతుల్లోనే అతడు హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇందులో 5 బౌండరీలతో పాటు 3 సిక్సులు ఉన్నాయి. 121 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన హిట్‌మ్యాన్.. ఆడుతోంది వన్డేలా.. టీ20లా అనేలా ఆశ్చర్యానికి గురిచేశాడు.
ఫినిష్ అయ్యే వరకు వదలడు
హాఫ్ సెంచరీ పూర్తయ్యాక మరో బౌండరీ కొట్టాడు రోహిత్. అతడి ఊపు చూస్తుంటే మ్యాచ్ ఫినిష్ అయ్యే వరకు క్రీజులో నుంచి కదిలేలా కనిపించడం లేదు. ప్రస్తుతం 47 బంతుల్లో 56 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు హిట్‌మ్యాన్. అతడితో పాటు వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (31 బంతుల్లో 15 నాటౌట్) కూడా క్రీజులోనే ఉన్నాడు. ప్రస్తుతం 13 ఓవర్లకు వికెట్లేమీ కోల్పోకుండా 76 పరుగులతో స్ట్రాంగ్‌గా ఉంది భారత్. రోహిత్ ఇంకో 15 ఓవర్లు క్రీజులో ఉంటే మ్యాచ్ ఫినిష్ అయ్యేలా కనిపిస్తోంది. మరి.. సెటిలైన హిట్‌మ్యాన్ ఛేజింగ్‌ను కంప్లీట్ చేస్తాడేమో చూడాలి.
ఇవీ చదవండి:
వరుణ్ మ్యాజికల్ డెలివరీ.. ఆడే మొనగాడే లేడు
టెంప్టింగ్ టార్గెట్.. ఉఫ్‌మని ఊదేస్తారా..
గర్ల్‌ఫ్రెండ్‌తో చాహల్.. అందరి ముందే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి