ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rohit-Virat: రోహిత్, కోహ్లీ కాదు.. ఆ భారత క్రికెటరే స్టార్ అంటున్న ఆస్ట్రేలియా ప్రధాని

ABN, Publish Date - Nov 28 , 2024 | 06:26 PM

Rohit-Virat: టీమిండియా అనగానే ఎవరికైనా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీనే గుర్తుకొస్తారు. కానీ ఆస్ట్రేలియా ప్రధాని మాత్రం వీళ్లిద్దరూ కాదు.. భారత జట్టులో ఓ నిజమైన స్టార్ ఉన్నాడని అంటున్నారు.

టీమిండియా అనగానే ఎవరికైనా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీనే గుర్తుకొస్తారు. అంతగా భారత జట్టుపై వీళ్లిద్దరూ బలమైన ముద్ర వేశారు. మెన్ ఇన్ బ్లూ బ్యాటింగ్‌కు మూలస్తంభాలుగా మారారు రోహిత్-కోహ్లీ. బ్యాటింగ్‌తో పాటు సారథ్య బాధ్యతల్ని కూడా సమర్థంగా నిర్వర్తిస్తున్నాడు హిట్‌మ్యాన్. కెప్టెన్సీ చేసిన అనుభవం ఉన్న కోహ్లీ.. రోహిత్‌కు ఆ విషయంలోనూ అండగా ఉంటున్నాడు. అందుకే వీళ్లిద్దరికీ భారీ ఫ్యాన్‌బేస్ ఉంది. వీళ్లను ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఆస్ట్రేలియా ప్రధాని మాత్రం భారత జట్టులో మరో సూపర్‌స్టార్ ఉన్నాడని అంటున్నారు.


బౌలింగ్‌కు ఫిదా

రోహిత్-కోహ్లీ కాదు.. భారత జట్టులో నిజమైన స్టార్ పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రానే అని ఆసీస్ ప్రధాని ఆంటోనీ అల్బనీస్ అన్నారు. అతడో అద్భుతమని మెచ్చుకున్నారు. బుమ్రా బౌలింగ్‌కు తాను ఫిదా అయ్యానని తెలిపారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆసీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు సభ్యులు ఇవాళ ఆ దేశ ప్రధాని ఆంటోనీని కలిశారు. ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌ జట్టుతో శనివారం నుంచి రెండ్రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది టీమిండియా. ఈ క్రమంలో పార్లమెంట్ హౌస్‌లో ప్రధాని ఆంటోనీతో భారత ఆటగాళ్లు భేటీ అయ్యారు. టీమ్ జెర్సీ వేసుకొనే ఆ మీటింగ్‌కు అటెండ్ అయ్యారు. ఒక వరుసలో నిల్చొని ఉన్న ఆటగాళ్లను ఆంటోనీకి పరిచయం చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ క్రమంలో తొలుత పేసుగుర్రం బుమ్రాను కలిసిన ఆసీస్ ప్రధాని.. అతడ్ని ప్రశంసల్లో ముంచెత్తారు. అతడు నిజమైన స్టార్ అని మెచ్చుకున్నారు.


ప్రధానినీ వదలని కోహ్లీ

టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కూడా ఆసీస్ ప్రధాని మెచ్చుకున్నారు. పెర్త్ టెస్ట్‌లో అద్భుతం జరిగింది, ఆ టైమ్‌లో తమ వాళ్లు పెద్దగా బాధపడినట్లు లేదు అని చెప్పుకొచ్చారు. దీనికి విరాట్ తనదైన స్టైల్‌లో రిప్లయ్ ఇచ్చాడు. మసాలా జోడించడానికి మీరెప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నాడు. దీంతో ఆంటోనీ సహా అక్కడ ఉన్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు. ఇది చూసిన నెటిజన్స్ కోహ్లీ కంగారూ ప్రధానిని కూడా వదలడం లేదని.. కౌంటర్ ఇచ్చిపడేశాడని కామెంట్స్ చేస్తున్నారు. బుమ్రా నిజమైన స్టార్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని.. అతడు ఏంటో ప్రత్యర్థి జట్టు మున్ముందు చూడబోతోందని చెబుతున్నారు.


Also Read:

జైస్వాల్‌ విషయంలో తప్పు చేశా.. ద్రవిడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

చేతిలో కత్తితో సీరియస్‌గా కోహ్లీ.. అంత కోపం ఎవరి మీదంటే..

ఆర్సీబీపై భగ్గుమంటున్న కన్నడ ఫ్యాన్స్

For More Sports And Telugu News

Updated Date - Nov 28 , 2024 | 06:40 PM