Rohit-Jaiswal: జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్.. గల్లీ క్రికెట్ అనుకుంటున్నావా అంటూ..
ABN, Publish Date - Dec 26 , 2024 | 04:16 PM
Boxing Day Test: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడూ చిల్ మోడ్‌లో ఉంటాడు. ఎంత ఒత్తిడి ఉన్నా కూల్‌గా ఉంటాడు. ఇతర ప్లేయర్ల నుంచి ప్రెజర్‌ను తీసుకొని వాళ్లను స్వేచ్ఛగా ఆడనిస్తాడు. అయితే ఒక్కోసారి మాత్రం అతడు అగ్రెషన్‌ను బయటకు తీస్తాడు. అప్పుడు అవతలి ప్లేయర్లకు దబిడిదిబిడే.
IND vs AUS: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడూ చిల్ మోడ్‌లో ఉంటాడు. ఎంత ఒత్తిడి ఉన్నా కూల్‌గా ఉంటాడు. ఇతర ప్లేయర్ల నుంచి ప్రెజర్‌ను తీసుకొని వాళ్లను స్వేచ్ఛగా ఆడనిస్తాడు. అయితే ఒక్కోసారి మాత్రం అతడు అగ్రెషన్‌ను బయటకు తీస్తాడు. అప్పుడు అవతలి ప్లేయర్లకు దబిడిదిబిడే. ఇవాళ అదే జరిగింది. బాక్సింగ్ డే టెస్ట్ తొలి రోజు రోహిత్ ఆవేశంగా కనిపించాడు. అసలే ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూకుడుగా బ్యాటింగ్ చేయడం, వికెట్లు పడకపోవడంతో హిట్‌మ్యాన్ ఫ్రస్ట్రేషన్‌కు గురయ్యాడు. ఈ సమయంలో ఓ తప్పు చేసి అతడికి అడ్డంగా దొరికాడు యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్. దీంతో ఆ కోపాన్ని అతడిపై చూపించాడు భారత సారథి.
గల్లీ క్రికెటా?
మెల్‌బోర్న్ టెస్ట్ తొలి రోజు జైస్వాల్ బ్యాటర్‌కు దగ్గరగా ఫీల్డింగ్ చేశాడు. ఫార్వర్డ్ షార్ట్ లెగ్‌లో ఉంటూ ఆసీస్ ఆటగాళ్లను కవ్వించాడు. అయితే బాగానే ఫీల్డింగ్ చేసినా.. ఆ పొజిషన్‌లో అంతగా అనుభవం లేకపోవడంతో కీలక సమయాల్లో తడబడ్డాడు. కొన్నిసార్లు బాల్ తన వైపు రాగానే బాగా ఎత్తుకు ఎగరడం, పక్క నుంచి పోతున్నా జంప్ చేయడం, భయపడటం లాంటివి చేశాడు. దీంతో స్లిప్‌లో ఉన్న రోహిత్ అతడిపై సీరియస్ అయ్యాడు. గల్లీ క్రికెట్ అనుకుంటున్నావా? ఎందుకు అలా ఎగురుతున్నావ్ అంటూ ఫైర్ అయ్యాడు. మళ్లీ ఇలాగే చేస్తే ఊరుకోనంటూ అతడికి వార్నింగ్ ఇచ్చాడు హిట్‌మ్యాన్.
లేచావో ఇక అంతే..
‘ఏమైంది? ఇదేమైనా గల్లీ క్రికెట్ అనుకుంటున్నావా? ఎందుకు పదే పదే ఎగురుతున్నావ్? కూర్చొనే ఉండు. బాల్ దగ్గరకు వచ్చేంత వరకు అదే పొజిషన్‌లో ఉండు. లేచావో ఊరుకోను’ అంటూ జైస్వాల్‌కు ఇచ్చిపడేశాడు రోహిత్. దీంతో యంగ్ ప్లేయర్ అతడు చెప్పినట్లే చేశాడు. ఎక్కడ ఫీల్డింగ్ పొజిషన్ మారుస్తాడో అనే భయంతో ఒళ్లు దగ్గర పెట్టుకొని మరింత జాగ్రత్తగా ఫీల్డింగ్ చేశాడు. కాగా, నాలుగో టెస్ట్ తొలి రోజు ఆట ముగిసేసరికి ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (68 నాటౌట్)తో పాటు ప్యాట్ కమిన్స్ (8 నాటౌట్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రాకు 3 వికెట్లు దక్కాయి. ఆకాశ్‌దీప్, జడేజా చెరో వికెట్ తీశారు.
Also Read:
జూనియర్ పాంటింగ్‌తో ఫైట్.. కోహ్లీకి షాక్ ఇచ్చిన ఐసీసీ
తగలరాని చోట తగిలిన బంతి.. స్మిత్ రియాక్షన్ వైరల్
సస్పెన్షన్ సమయంలో టోర్నీలు ఎలా ఆడింది?
For More Sports And Telugu News
Updated Date - Dec 26 , 2024 | 04:26 PM