ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: ప్రస్తుతం టాప్ 4లో ఉన్న జట్లు ఇవే! ఏ జట్టు ఇంకా ఎన్ని మ్యాచ్‌లు ఆడాలంటే..

ABN, Publish Date - Apr 04 , 2024 | 05:10 PM

ఐపీఎల్ 2024(IPL 2024) రసవత్తరంగా సాగుతోంది. బ్యాటర్లు పరుగుల వరద పారిస్తుంటే.. బౌలర్లు వికెట్ల వేట కొనసాగిస్తున్నారు. ఫీల్డర్లు తమ విన్యాసాలతో ఆకట్టుకుంటున్నారు. చూస్తుండగానే 16 మ్యాచ్‌లు ముగిశాయి. జట్లన్నీ 3 మ్యాచ్‌ల చొప్పున ఆడేశాయి.

ఐపీఎల్ 2024(IPL 2024) రసవత్తరంగా సాగుతోంది. బ్యాటర్లు పరుగుల వరద పారిస్తుంటే.. బౌలర్లు వికెట్ల వేట కొనసాగిస్తున్నారు. ఫీల్డర్లు తమ విన్యాసాలతో ఆకట్టుకుంటున్నారు. చూస్తుండగానే 16 మ్యాచ్‌లు ముగిశాయి. జట్లన్నీ 3 మ్యాచ్‌ల చొప్పున ఆడేశాయి. రెండు జట్లు నాలుగేసి మ్యాచ్‌ల చొప్పున కూడా ఆడాయి. ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు సార్లు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్లు నమోదయ్యాయి. అయితే ఇప్పటివరకు ముగిసిన మ్యాచ్‌లను బట్టి ప్రస్తుతం పాయింట్ల పట్టిక ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం.

ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా రెండు జట్లు అజేయంగా ఉన్నాయి. అవి కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals). ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో గెలిచి హ్యాట్రిక్ విజయాలు సాధించాయి. పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉన్నాయి. రెండు జట్ల ఖాతాలో ఆరేసి పాయింట్ల చొప్పున ఉన్నాయి. +2 నెట్ రన్ రేటు ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ మొదటి స్థానంలో ఉండగా.. +1 నెట్ రన్ రేటు ఉన్న రాజస్థాన్ రాయల్స్ రెండో స్థానంలో ఉంది. చెన్నైసూపర్ కింగ్స్, లక్నోసూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు మూడేసి మ్యాచ్‌ల చొప్పున ఆడి రెండేసి మ్యాచ్‌ల చొప్పున గెలిచాయి. ఈ జట్ల ఖాతాలో నాలుగేసి పాయింట్ల చొప్పున ఉన్నాయి. అయితే నెట్ రన్ రేటు ప్లస్‌ల్లో ఉన్న చెన్నై, లక్నో మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. నెట్‌ రన్ రేటు మైనస్‌లో ఉండడంతో గుజరాత్ ఐదో స్థానంలో ఉంది.


ఇక సన్‌రైజర్స్ హైదారాబాద్, పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఒక్కో మ్యాచ్ చొప్పున గెలిచాయి. ఈ జట్ల ఖాతాల్లో రెండేసి పాయింట్ల చొప్పున ఉన్నాయి. అయితే రన్‌రేటులో తేడా కారణంగా సన్‌రైజర్స్ ఆరో స్థానంలో, పంజాబ్ ఏడో స్థానంలో, బెంగళూరు ఎనిమిదో స్థానంలో, ఢిల్లీ 9వ స్థానంలో ఉన్నాయి. ఇక ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా గెలవని ఏకైక జట్టు ముంబై ఇండియన్స్. ఆ జట్టు ఆడిన మూడింటిలో ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో ఉంది. ఇప్పటివరకు బెంగళూరు, ఢిల్లీ జట్లు అత్యధికంగా నాలుగేసి మ్యాచ్‌ల చొప్పున ఆడాయి. ఈ జట్లకు మరో పదేసి మ్యాచ్‌ల చొప్పున మిగిలి ఉన్నాయి. ఈ రెండు జట్లు మినహా మిగతా అన్ని టీంలు మూడేసి మ్యాచ్‌లు ఆడాయి. వాటంన్నిటికి 11 మ్యాచ్‌ల చొప్పున మిగిలి ఉన్నాయి. కాగా జట్లన్నీ ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉండడంతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టే 4 జట్లపై ఇప్పుడే స్పష్టత వచ్చే అవకాశం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024: దిగ్గజ బ్యాటర్ల సరసన రస్సెల్.. ఆ ఘనత సాధించిన ఆటగాడిగా..

IPL 2024: డేంజర్ జోన్‌లో రిషబ్ పంత్.. మరొక తప్పు చేస్తే..

Updated Date - Apr 04 , 2024 | 05:10 PM

Advertising
Advertising