Share News

Joginder Sharma: 2007 టీ20 ప్రపంచకప్ హీరోకు షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు

ABN , Publish Date - Jan 05 , 2024 | 04:01 PM

Joginder Sharma: 2007 టీ20 ప్రపంచకప్ హీరో జోగిందర్ శర్మకు హర్యానా పోలీసులు షాక్ ఇచ్చారు. అతడిపై కేసు నమోదు చేశారు. హిస్సార్‌కు చెందిన పవన్ అనే వ్యక్తి జనవరి 1న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సదరు వ్యక్తి ఆత్మహత్యకు జోగిందర్ శర్మ కారణమన్న ఆరోపణలపై హర్యానా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Joginder Sharma: 2007 టీ20 ప్రపంచకప్ హీరోకు షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు

2007 టీ20 ప్రపంచకప్ హీరో జోగిందర్ శర్మకు హర్యానా పోలీసులు షాక్ ఇచ్చారు. అతడిపై కేసు నమోదు చేశారు. హిస్సార్‌కు చెందిన పవన్ అనే వ్యక్తి జనవరి 1న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సదరు వ్యక్తి ఆత్మహత్యకు జోగిందర్ శర్మ కారణమన్న ఆరోపణలపై హర్యానా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు హర్యానా పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో జోగిందర్ శర్మతో పాటు అజయ్‌వీర్, ఈశ్వర్ ప్రేమ్, రాజేంద్ర సిహాగ్‌ సహా మరో ఐదుగురి పేర్లు కూడా ఉన్నాయి. ఆస్తి వివాదంపై గతంలో డీఎస్పీగా పనిచేసిన జోగిందర్ శర్మకు మూడేళ్ల క్రితం ఫిర్యాదు చేసినా ఆయన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయనపైనా అధికారులు కేసు నమోదు చేసినట్లు సమాచారం అందుతోంది.

కాగా హిస్సార్‌లో నివాసముంటున్న పవన్ జనవరి 1న ఆస్తి తగాదాలతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు పవన్ తల్లి సునీత పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆస్తికి సంబంధించిన కేసు కోర్టులో విచారణలో ఉందని చెప్పారు. మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మతో సహా ఆరుగురు వ్యక్తులు తన కుమారుడిని వేధించారని, అందుకే పవన్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె ఆరోపించింది. అత్యాచార నిరోధక చట్టం కింద నిందితులను తప్పనిసరిగా అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పవన్ మృతదేహంతో ఆయన కుటుంబం నిరసనకు దిగింది. కుటుంబానికి ఆర్థిక సహాయం, కేసుపై న్యాయమైన విచారణ సహా తమ ఆరు డిమాండ్లను కూడా పవన కుటుంబీకులు పోలీసుల ముందు ఉంచారు. నిందితులపై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు అభియోగాలు మోపామని, విచారణ తర్వాతే ఎస్సీ/ఎస్టీ సెక్షన్‌ను జోడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 05 , 2024 | 04:01 PM