T 20 World Cup: ఐసీసీ చైర్మన్ పదవికి అడుగుదూరంలో..!!
ABN, Publish Date - Jul 18 , 2024 | 04:01 PM
ఇటీవల టీ 20 వరల్డ్ కప్ ముగిసిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ మ్యాచ్‌లకు అగ్రరాజ్యం అమెరికా ఆతిథ్యం ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్‌కు ప్రేక్షకుల నుంచి అంతగా ఆదరణ రాలేదు. దాంతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు భారీగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. రూ.167 కోట్ల మేర ఐసీసీ నష్టపోయిందని పీటీఐ రిపోర్ట్ చేసింది.
ఇటీవల టీ 20 వరల్డ్ కప్ (T20 World Cup 2024) ముగిసిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ మ్యాచ్‌లకు అగ్రరాజ్యం అమెరికా ఆతిథ్యం ఇచ్చింది. ఆ దేశంలో ఉన్న బేస్ బాల్ స్టేడియాలను క్రికెట్ స్టేడియాలుగా మార్చారు. అందుకోసమే కాబోలు బాల్ వల్ల బ్యాట్స్ మెన్ ఇబ్బంది పడ్డారు. ఏ దేశం అయిన క్రికెట్‌లోకి వస్తే ఆ దేశంలో టోర్నమెంట్ నిర్వహించి ఆటకు క్రేజ్ వచ్చేలా చేస్తారు. వరల్డ్ కప్ విషయంలో కూడా అమెరికాకు అతిథ్యం ఇచ్చారు. టీ20 వరల్డ్ కప్‌కు ప్రేక్షకుల నుంచి అంతగా ఆదరణ రాలేదు. దాంతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు భారీగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. రూ.167 కోట్ల మేర ఐసీసీ నష్టపోయిందని పీటీఐ రిపోర్ట్ చేసింది.
కొలంబోలో సమావేశం
కొలంబోలో రేపటి నుంచి ఐసీసీ అన్యువల్ కాన్ఫరెన్స్ జరగనుంది. 9 అంశాలపై చర్చిస్తామని అన్యువల్ జనరల్ మీటింగ్ అజెండాలో చేర్చారు. అందులో టీ 20 వరల్డ్ కప్ నష్టానికి సంబంధించిన అంశం మాత్రం లేదు. సమావేశం తర్వాత చర్చిస్తారని తెలుస్తోంది. దీంతోపాటు బీసీసీఐ సెక్రటరీ జై షాకు ఐసీసీ చైర్మన్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఐసీసీ చైర్మన్ గ్రెగ్ స్థానంలో షాకు బాధ్యతలు ఇచ్చే ఛాన్స్ ఉంది.
సర్వత్రా ఆసక్తి..!!
జై షాకు బాధ్యతలు అప్పగించే అంశం ఐసీసీలో ప్రతి ఒక్కరికి ఆసక్తి కలిగించే ప్రధాన అంశాల్లో ఒకటిగా ఉంది. జై షా బీసీసీఐ సెక్రటరీగా 2025 వరకు ఉండాల్సి వస్తోంది. దాంతోపాటు గ్రెగ్ 2024లో మూడో సారి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2026 డిసెంబర్ వరకు పదవిలో ఉండాలి. మధ్యలోనే పదవి నుంచి వైదొలిగే అవకాశాలు ఉన్నాయి.
ICC T20I Rankings: శుభ్‌మన్ గిల్ భారీ జంప్.. టాప్-5 నుంచి పాండ్యా ఔట్
జై షాకు పట్టం..!!
ఐసీసీ చైర్మన్ పదవిని ఒకరు మూడు సార్లు చేపట్టే అవకాశం ఉంది. ఒక్కసారి రెండేళ్లు చొప్పున ఆరేళ్ల వరకు పదవిలో కొనసాగడానికి వీలుంది. గ్రెగ్ మూడోసారి పదవిలో ఉన్నారు. వచ్చే ఏడాది జై షా ఐసీసీ చైర్మన్ పదవి చేపడితే అర్ధాంతరంగా వైదొలగాల్సి వస్తోంది. జై షా 2028 వరకు ఐసీసీ చైర్మన్‌గా కొనసాగే అవకాశం ఉంది. ఐసీసీ చైర్మన్ పదవి బాధ్యతలు ఒకసారి రెండేళ్లు లేదంటే మూడేళ్లు చేపట్టేందుకు ఆస్కారం ఉంది.
India vs Sri Lanka: శ్రీలంకతో వన్డే సిరీస్.. కెప్టెన్ రేసులో ఆ ఇద్దరి మధ్య పోటీ?
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Sports News and Latest Telugu News
Updated Date - Jul 18 , 2024 | 04:01 PM