ICC Rankings: టెస్టు ర్యాంకింగ్స్‌లో జైస్వాల్ దూకుడు.. ఏకంగా 31 స్థానాలు ఎగబాకిన జురెల్
ABN, Publish Date - Feb 28 , 2024 | 03:02 PM
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత కుర్రాళ్లు సత్తా చాటారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో దుమ్ములేపుతున్న టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ 3 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ ర్యాంకు సాధించాడు. 727 రేటింగ్ పాయింట్లతో 12వ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో 22 ఏళ్ల జైస్వాల్ చెలరేగుతున్నాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 93 సగటుతో 655 పరుగులు చేశాడు.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత కుర్రాళ్లు సత్తా చాటారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో దుమ్ములేపుతున్న టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ 3 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ ర్యాంకు సాధించాడు. 727 రేటింగ్ పాయింట్లతో 12వ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో 22 ఏళ్ల జైస్వాల్ చెలరేగుతున్నాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 93 సగటుతో 655 పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రాంచీ వేదికగా జరిగిన మూడో టెస్టులోనూ రాణించిన జైస్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో 73, రెండో ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేశాడు. అదే సమయంలో జైస్వాల్ తోటి ఓపెనర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఒక స్థానాన్ని కోల్పోయాడు. 12వ స్థానం నుంచి 13వ స్థానానికి పడిపోయాడు. హిట్‌మ్యాన్ ఖాతాలో 720 రేటింగ్ పాయింట్లున్నాయి. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో రోహిత్ శర్మ ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీతో రాణించాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి టాప్ 10లో ఒక విరాట్ కోహ్లీ మాత్రమే ఉన్నాడు. 744 రేటింగ్ పాయింట్లతో కోహ్లీ 9వ స్థానంలో ఉన్నాడు. రోడ్డు ప్రమాదం కారణంగా ఏడాది కాలంగా భారత జట్టుకు దూరంగా ఉంటున్న రిషబ్ పంత్ 699 రేటింగ్ పాయింట్లతో 14వ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రాణిస్తున్న గిల్ 4 స్థానాలు ఎగబాకి 31వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో సంచలన ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన ధృవ్ జురేల్ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. ఏకంగా 31 స్థానాలు ఎగబాకి 69వ స్థానానికి చేరుకున్నాడు.
నాలుగో టెస్టులో అజేయ సెంచరీతో చెలరేగిన ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జోరూట్ రెండు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం రూట్ ఖాతాలో 799 రేటింగ్ పాయింట్లున్నాయి. మరో ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ 16వ స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్, ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. 893 రేటింగ్ పాయింట్లతో విలియమ్సన్ మొదటి స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో స్మిత్‌కు రూట్‌కు మధ్య ఏకంగా 75 రేటింగ్ పాయింట్ల తేడా ఉంది. స్మిత్ ఖాతాలో ప్రస్తుతం 818 రేటింగ్ పాయింట్లున్నాయి. దీంతో విలియమ్సన్ నంబర్ వన్ స్థానానికి ఇప్పట్లో ఢోకా లేదనే చెప్పుకోవాలి. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే టీమిండియా ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం బుమ్రా ఖాతాలో 867 రేటింగ్ పాయింట్లు, అశ్విన్ ఖాతాలో 846 రేటింగ్ పాయింట్లున్నాయి. 785 రేటింగ్ పాయింట్లతో జడేజా కూడా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్ 6లో ఏకంగా ముగ్గురు భారత ఆటగాళ్లు ఉండడం గమనార్హం. ఆల్‌రౌండర్ల విభాగంలో కూడా భారత ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తొలి రెండు స్థానాల్లో కొనాసాగుతున్నారు. మొదటి స్థానంలో ఉన్న జడేజాకు రెండో స్థానంలో అశ్విన్‌కు ఏకంగా 126 పాయింట్ల తేడా ఉంది. దీంతో జడేజా నంబర్ వన్ స్థానానికి ఇప్పట్లో ఢోకా లేదనే చెప్పుకోవాలి. ప్రస్తుతం జడేజా ఖాతాలో 449 రేటింగ్ పాయింట్లు, అశ్విన్ ఖాతాలో 323 రేటింగ్ పాయింట్లున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 28 , 2024 | 03:02 PM