ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gambhir: కోచ్ మొదలెట్టేశాడు

ABN, Publish Date - Jul 12 , 2024 | 04:12 PM

టీమిండియా హెడ్ కోచ్‌గా నియమితులైన గౌతమ్ గంభీర్ తన మార్క్ స్ట్రాటజీస్ మొదలెట్టేశాడు. జట్టు సభ్యులు అందరూ అన్ని ఫార్మాట్లలో విధిగా ఆడాలని స్పష్టం చేశారు. జట్టు ప్రయోజనాల కోసం ఆడాలని తేల్చి చెప్పారు.

Gambhir

టీమిండియా హెడ్ కోచ్‌గా నియమితులైన గౌతమ్ గంభీర్ (Gambhir) తన మార్క్ స్ట్రాటజీస్ మొదలెట్టేశాడు. జట్టు సభ్యులు అందరూ అన్ని ఫార్మాట్లలో విధిగా ఆడాలని స్పష్టం చేశారు. జట్టు ప్రయోజనాల కోసం ఆడాలని తేల్చి చెప్పారు. ఆట ఆడే సమయంలో గాయాలు కావడం కామన్ అని స్పష్టం చేశారు. మూడు ఫార్మాట్లలో ఆడే సమయంలో గాయపడితే, తిరిగి మళ్లీ కోలుకుంటారు. మీరు తప్పకుండా మూడు ఫార్మాట్లలో ఆడాలి. ఒకరిని టెస్ట్‌ల కోసం, మరొకరిని వన్డేలు, ఇంకొకరు టీ 20లు అని ప్రత్యేకంగా కేటాయించలేం. అందరూ అన్ని ఫార్మాట్లు ఆడాల్సిందేనని వీడియోలో స్పష్టం చేశారు. ఆ వీడియోను స్టార్ స్పోర్ట్స్ పోస్ట్ చేసింది.


వీలైనంత ఎక్కువ ఆడాలి

‘మీకు చాలా తక్కువ సమయం ఉంది. మీరు దేశం కోసం ఆడే సమయంలో వీలైనంత ఎక్కువగా ఆడాలి. మీరు ఫామ్‌లో ఉంటే.. విధిగా టెస్ట్, వన్డే, టీ 20లో ఆడాలి అని’ గౌతమ్ గంభీర్ తేల్చి చెప్పారు. ఆట ప్రాక్టీస్ చేయడంతో అలవాటు అవుతుంది. గాయపడిన వారు కోలుకుంటారు. ఆ తర్వాత జట్టు ప్రయజనాల కోసం తిరిగి ఆడతారు.


Pakistan: కోహ్లీ పాకిస్తాన్ వస్తే.. భారత్‌ను మర్చిపోతాడు.. పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రీది ఆసక్తికర వ్యాఖ్యలు!

నిజాయితీగా ఆడాలి

‘ప్రొఫెషనల్ ఆటలో మీరు నిజాయితీగా ఆడాలి. నేను బ్యాటింగ్ చేసే సమయంలో ఫలితం గురించి ఆలోచించను. ఇన్ని పరుగులు చేయాలని లక్ష్యం ఏం విధించుకోను. నా ఆటకు న్యాయం చేస్తానని విశ్వసిస్తా. అందుకోసం కొన్ని నియమాలు విధించుకున్నా. కొన్ని విలువలను పాటిస్తా. యావత్ ప్రపంచం మీకు వ్యతిరేకంగా ఉన్నా సరే. మీరు మాత్రం జట్టు ప్రయోజనాల కోసం పోరాడాలి అని’ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి..


కోహ్లీనా.. అతడెవరు?


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 12 , 2024 | 04:12 PM

Advertising
Advertising
<