ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jaiswal-Gill: జైస్వాల్‌పై గిల్ సీరియస్.. వినిపించడం లేదా అంటూ..

ABN, Publish Date - Dec 07 , 2024 | 06:10 PM

Jaiswal-Gill: పింక్ బాల్ టెస్ట్‌లో భారత్ ఎదురీదుతోంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండ్ ప్రదర్శన ముందు రోహిత్ సేన నిలబడటం కష్టంగా ఉంది. బ్యాటర్ల ఫెయిల్యూర్ టీమ్‌కు శాపంగా మారింది.

IND vs AUS: సిరీస్ ఓపెనర్‌లో గెలిచిన టీమిండియా.. రెండో టెస్ట్‌లోనూ ఆస్ట్రేలియాను మడతబెట్టేస్తుందని అంతా అనుకున్నారు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు తోడు యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ కూడా టీమ్‌లో జాయిన్ అవడంతో మనకు ఎదురులేదని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. పింక్ బాల్ టెస్ట్‌లో భారత్ ఎదురీదుతోంది. కంగారూల ఆల్‌రౌండ్ ప్రదర్శన ముందు రోహిత్ సేన నిలబడటం కష్టంగా మారింది. బ్యాటర్ల ఫెయిల్యూర్ టీమ్‌కు శాపంగా మారింది. గెలుపు సంగతి పక్కనబెడితే ఓటమిని తప్పించుకోవడం కూడా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఈ తరుణంలో యంగ్ బ్యాటర్ల ఫైట్ టీమ్‌ను మరింత ఇరుకున పెట్టింది. ఆ గొడవ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..


సమన్వయ లోపం

అడిలైడ్ టెస్ట్‌ టీమిండియా రెండో ఇన్నింగ్స్ సమయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. యంగ్ బ్యాటర్స్ శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ క్రీజులో ఉన్నారు. ఇద్దరి మధ్య రెండో వికెట్‌కు 30 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. మంచి ఊపు మీద ఉండటంతో ఇంక భారత్‌కు ఢోకా లేదని అంతా అనుకున్నారు. అయితే ఈ తరుణంలో జైస్వాల్‌పై గిల్ సీరియస్ అయ్యాడు. వినిపించడం లేదా అంటూ ఫైర్ అయ్యాడు. దీనికి కారణం ఇద్దరూ రన్ తీస్తున్న సమయంలో నెలకొన్న కన్‌ఫ్యూజనే. సమన్వయ లోపంతో అప్పటికే ఒకట్రెండు సార్లు గిల్ ఇబ్బంది పడ్డాడు.


అర్థమవుతోందా..

పరుగు కోసం గిల్ సరిగ్గానే కాల్ ఇచ్చినా జైస్వాల్ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. దీంతో శుబ్‌మన్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఎందుకిలా చేస్తున్నావంటూ అతడిపై సీరియస్ అయ్యాడు. ఇప్పటి నుంచైనా సరిగ్గా చూడు.. పరుగు కోసం కరెక్ట్‌గా పిలుస్తానని, కాల్‌ను అర్థం చేసుకోమని వాపోయాడు. దీంతో సర్లే.. కూల్ అని జైస్వాల్ అక్కడి నుంచి వేరే ఎండ్‌కు వెళ్లిపోయాడు. అయితే ఇది జరిగిన కాసేపటికే స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు యశస్వి. రెండో రోజు ముగిసేసరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఆసీస్ స్కోరుకు ఇంకా 29 పరుగుల దూరంలో ఉంది మెన్ ఇన్ బ్లూ.


Also Read:

స్టార్క్ స్టన్నింగ్ డెలివరీకి బిత్తరపోయిన గిల్.. ఇదేం బౌలింగ్ సామి

శనిలా తగులుకున్న హెడ్.. రోహిత్‌పై ఎందుకింత పగ

అంపైర్‌తో గొడవకు దిగిన కోహ్లీ.. ప్రూఫ్స్ చూపించి మరీ..

ఆస్ట్రేలియాకు కోహ్లీ వార్నింగ్.. రా చూస్కుందామంటూ..

For More Sports And Telugu News

Updated Date - Dec 07 , 2024 | 06:14 PM