ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IND vs ENG: సెంచరీతో రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ధోని రికార్డు బద్దలు

ABN, Publish Date - Feb 15 , 2024 | 03:17 PM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను రవీంద్ర జడేజాతో కలిసి ఆదుకున్నాడు. తన కెప్టెన్ ఇన్నింగ్స్‌తో కష్టాల్లో ఉన్న జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు.

రాజ్‌కోట్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను రవీంద్ర జడేజాతో కలిసి ఆదుకున్నాడు. తన కెప్టెన్ ఇన్నింగ్స్‌తో కష్టాల్లో ఉన్న జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ సెంచరీతో చెలరేగాడు. 11 ఫోర్లు, 2 సిక్సులతో 157 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో రోహిత్‌కు ఇది 11వ సెంచరీ. ఈ క్రమంలో రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో టీమిండియా తరఫున సెంచరీ చేసిన అత్యధిక వయసు గల కెప్టెన్‌గా నిలిచాడు. కాగా ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు 36 సంవత్సరాలు.


అలాగే ఈ ఇన్నింగ్స్‌లో కొట్టిన 2 సిక్సుల ద్వారా టెస్టుల్లో అత్యధిక సిక్సులు కొట్టిన భారత బ్యాటర్ల జాబితాలో మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని రికార్డును బద్దలుకొట్టాడు. ధోని 78 సిక్సులు కొట్టగా.. రోహిత్ 79 సిక్సులతో మహీని అధిగమించాడు. దీంతో టీమిండియా తరఫున అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ రెండో స్థానానికి చేరుకున్నాడు. మొత్తంగా ఈ జాబితాలో మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ 90 సిక్సులతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక రోహిత్ శర్మ సెంచరీ, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో రాజ్‌కోట్ టెస్టులో ప్రస్తుతం టీమిండియా స్కోర్ 200 దాటింది. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా కలిసి నాలుగో వికెట్‌కు అజేయంగా 170 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఇలాంటి మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2024 | 03:25 PM

Advertising
Advertising