ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: చెన్నైసూపర్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ పిచ్ రిపోర్టు ఇదే!

ABN, Publish Date - Mar 26 , 2024 | 04:32 PM

ఐపీఎల్ 2024లో( IPL 2024) నేడు సూపర్ ఫైట్ జరగనుంది. గతేడాది ఫైనలిస్ట్‌లు గుజరాత్ టైటాన్, చెన్నైసూపర్ కింగ్స్(Chennai Super Kings vs Gujarat Titans) తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.

చెన్నై: ఐపీఎల్ 2024లో( IPL 2024) నేడు సూపర్ ఫైట్ జరగనుంది. గతేడాది ఫైనలిస్ట్‌లు గుజరాత్ టైటాన్, చెన్నైసూపర్ కింగ్స్(Chennai Super Kings vs Gujarat Titans) తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. రెండు జట్లు తమ తమ తొలి మ్యాచ్‌ల్లో గెలిచి టోర్నీలో శుభారంభం చేశాయి. యువ కెప్టెన్ల నేతృత్వంలోని రెండు జట్లు మంచి జోష్‌లో ఉన్నాయి. ఈ సీజన్‌లో గుజరాత్‌ను శుభ్‌మన్ గిల్(Shubman Gill), చెన్నైని రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) నడిపిస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లు ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. గుజరాత్ 3, చెన్నై 2 మ్యాచ్‌ల్లో గెలిచాయి. చెన్నై గెలిచిన రెండు మ్యాచ్‌లు నాకౌట్ పోటీల్లో కావడం గమనార్హం. గతేడాది మొదటి క్వాలిఫైయర్‌లో, ఫైనల్‌లో గుజరాత్‌ను చెన్నై ఓడించింది. రెండు జట్ల పోటీల్లో చెన్నై అత్యధిక స్కోర్ 178 కాగా.. గుజరాత్ అత్యధిక స్కోర్ 214గా ఉంది.


మ్యాచ్ జరిగే చెన్నై చిదంబరం స్టేడియం పిచ్ రిపోర్టు విషయానికొస్తే.. ఈ సీజన్‌లో ఇక్కడ జరిగే రెండో మ్యాచ్ ఇది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. గత మ్యాచ్‌లో బెంగళూరు విసిరిన 174 పరుగుల లక్ష్యాన్ని చెన్నైసూపర్ కింగ్స్ సునాయసంగా చేధించింది. రెండు జట్టలో బిగ్ హిట్లర్లు ఉండడంతో నేడు జరిగే మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నాయి. ఈ పిచ్ ఎప్పుడూ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. చెన్నైకి రవీంద్ర జడేజా, మహేష్ తీక్షణ రూపంలో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. గుజరాత్‌కు రషీద్ ఖాన్, సాయి కిషోర్ రూపంలో మంచి స్పిన్నర్లు ఉన్నారు. పేసర్లు కూడా సత్తా చాటుతారు. ఇదే పిచ్‌పై బెంగళూరుతో చెన్నై ఆడిన చివరి మ్యాచ్‌లో ఆ జట్టు పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ 4 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ పిచ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లో 6 టీ20లు జరగగా మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 5 మ్యాచ్‌ల్లో గెలవగా.. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు ఒకేసారి గెలిచింది.

RCB vs PBKS: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. దిగ్గజ ప్లేయర్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు

IPL 2024: ముంబైకి కూడా సన్‌రైజర్స్ గతే పట్టనుందా..? రోహిత్‌ను చూస్తే కన్నీళ్లు ఆగడం లేదంటున్న ఫ్యాన్స్



Updated Date - Mar 26 , 2024 | 04:32 PM

Advertising
Advertising