ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా మళ్లీ రోహిత్ శర్మ?.. ఇందులో నిజమెంత..

ABN, Publish Date - Apr 04 , 2024 | 06:17 PM

ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్‌కు ఇప్పటివరకు ఏది కలిసిరాలేదు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి అతని స్థానంలో హార్దిక్ పాండ్యాను తీసుకురావడం బెడిసికొచ్చింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఆశించిన మేర సత్తా చాటలేకపోతున్నాడు. దీనికి తోడు జట్టు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

ఐపీఎల్ 2024లో(IPL 2024) ముంబై ఇండియన్స్‌కు(Mumbai Indians) ఇప్పటివరకు ఏది కలిసిరాలేదు. రోహిత్ శర్మను(Rohit sharma) కెప్టెన్సీ నుంచి తప్పించి అతని స్థానంలో హార్దిక్ పాండ్యాను(Hardik Pandya) తీసుకురావడం బెడిసికొచ్చింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఆశించిన మేర సత్తా చాటలేకపోతున్నాడు. దీనికి తోడు జట్టు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ సీజన్‌లో ఇంకా బోణీ చేయలేదు. ప్రధానంగా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని అభిమానులు జీర్ణించులేకపోతున్నారు. ఈ ప్రకటన చేసిన రోజు నుంచే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్‌పై, హార్దిక్ పాండ్యాపై విమర్శలు వెలువెత్తున్నాయి. చాలా మంది ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ఖాతాలను ఆన్ ఫాలో చేశారు. దీంతో ఒకప్పుడు సోషల్ మీడియాలో అత్యధిక అభిమానుల ఫాలోయింగ్ ఉన్న జట్టుగా ఉన్న ముంబై ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోయింది. ఇక ముంబై ఆడే మ్యాచ్‌ల్లో అయితే రోహిత్ శర్మకు పెద్ద ఎత్తును మద్దతు లభిస్తోంది. కావాలని హార్దిక్ పాండ్యాను, ముంబై మేనేజ్‌మెంట్‌ను అభిమానులు హేళన చేస్తున్నారు.

దీనికి తోడు మొదటి మ్యాచ్‌లో రోహిత్ శర్మ(Rohit sharma) పట్ల కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రవర్తన తీరు అభిమానుల ఆగ్రహాలకు మరింత నిప్పురాజేసింది. అప్పటినుంచి రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్ అభిమానులే కాకుండా ఇతర క్రికెటర్ల అభిమానులు, సాధారణ క్రికెట్ అభిమానులు కూడా హిట్‌మ్యాన్ వైపే నిలుస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే అభిమానుల ఆగ్రహావేశాలు ఇప్పట్లో తగ్గేలా లేవు. అంతేకాకుండా ఈ వివాదం కారణంగా భవిష్యత్‌లో ముంబై బ్రాండ్ వాల్యూ కూడా తగ్గే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. పరిస్థితి రోజురోజుకు దిగజారి పోతుండడంతో ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ దిద్దుబాటు చర్యలు చేపట్టిందని సమాచారం. ఈ మేరకు పలు జాతీయ క్రీడా వెబ్‌సైట్స్ తమ కథనాల్లో పేర్కొంటున్నాయి. జాతీయ క్రీడా వెబ్‌సైట్స్ చెబుతున్న వివరాలు ప్రకారం.. రోహిత్ శర్మను మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌ను చేయనున్నారట. అది కూడా త్వరలోనే అని సమాచారం. ముంబై ఇండియన్స్ ఏప్రిల్ 1న రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ఆడింది. తదుపరి మ్యాచ్‌ను 7న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. 6 రోజుల గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌లో ముంబై మేనేజ్‌మెంట్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. తదుపరి మ్యాచ్ నుంచి ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ నాయకత్వంలో ఆడే అవకాశం ఉందట.


ముఖ్యంగా భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఈ విషయాన్ని బలంగా చెబుతున్నారు. ఆ జాతీయ క్రీడా ఛానెల్‌లో తివారీ మాట్లాడుతూ.. తనకు ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ గురించి బాగా తెలుసని, వారు కెప్టెన్సీని మళ్లీ రోహిత్ శర్మకు అప్పగించడానికి వెనుకాడక పోవచ్చని అన్నాడు. ‘‘ఇది జరగవచ్చు. ఇది చాలా పెద్ద నిర్ణయం. ఎందుకంటే ముంబై ఫ్రాంచైజీ, ఓనర్లను నేను అర్థం చేసుకున్నాను. వారు ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడరు. హార్దిక్ ఒత్తిడిలో ఉన్నాడు. మొదటి 2 మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేసిన హార్దిక్.. మూడో మ్యాచ్‌లో బౌలింగ్ చేయలేదు. ఈ విరామ సమయంలో హార్దిక్ పాండ్యా నుంచి కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించవచ్చని నేను భావిస్తున్నాను. ఐదు టైటిళ్లు గెలిచిన కెప్టెన్‌ను మార్చినప్పుడు ఇది చాలా పెద్ద అంశం. ఇప్పుడు వారు ఒక మ్యాచ్ కూడా గెలవలేదు. కెప్టెన్సీ కూడా మందకొడిగా ఉంది. తప్పులు జరుగుతున్నాయి’’ అని చెప్పాడు. కాగా అదే కార్యక్రమంలో ఉన్న దిగ్గజ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా తివారీ వ్యాఖ్యలకు మద్దతివ్వడం గమనార్హం.

కెప్టెన్సీ మార్పు జరుగుతుందా లేదా, ఇందులో నిజమెంత అనే విషయం తెలియాలంటే ముంబై తర్వాతి మ్యాచ్ నాటికి వేచిచూడాలి. లేదంటే మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు. మరికొంత మంది క్రీడా విశ్లేషకులు మాత్రం కెప్టెన్సీ మార్పు ఉండకపోవచ్చని అంటున్నారు. ఈ సీజన్ మొత్తం హార్దిక్ పాండ్యానే కెప్టెన్‌గా ఉంటాడని అంచనా వేస్తున్నారు. ఒకవేళ కెప్టెన్సీ మార్పు జరిగితే ఇలా జరగడం ఐపీఎల్‌లో ఇది మొదటిసారి ఏం కాదు. గతంలో ఓ సీజన్‌లో ఆరంభంలో చెన్నైసూపర్ కింగ్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా వ్యవహరించాడు. కానీ అతని పని తీరు సరిగ్గా లేకపోవడంతో తిరిగి ధోని కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024: దిగ్గజ బ్యాటర్ల సరసన రస్సెల్.. ఆ ఘనత సాధించిన ఆటగాడిగా..

IPL 2024: డేంజర్ జోన్‌లో రిషబ్ పంత్.. మరొక తప్పు చేస్తే..

Updated Date - Apr 04 , 2024 | 06:17 PM

Advertising
Advertising