SRH vs MI: మన హైదరాబాద్ వేదికగా రాత్రి 7:30 గంటలకు చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
ABN, Publish Date - Mar 27 , 2024 | 03:04 PM
ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం జరిగే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడు రోహిత్ శర్మ చరిత్ర సృష్టించనున్నాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ముంబై ఇండియన్స్ బుధవారం తలపడనుంది.
హైదరాబాద్: ఐపీఎల్ 2024లో(IPL 2024) భాగంగా బుధవారం జరిగే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడు రోహిత్ శర్మ (Rohit Sharma) చరిత్ర సృష్టించనున్నాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ముంబై ఇండియన్స్ (Sunrisers Hyderabad vs Mumbai Indians) బుధవారం తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకోనున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ తరఫున 200 మ్యాచ్‌లు ఆడిన మొదటి ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించనున్నాడు. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది కాబట్టి అప్పుడే ఈ హిట్‌మ్యాన్ ఈ రికార్డును అందుకోనున్నాడు.
ముంబై ఇండియన్స్ తరఫున ఇప్పటికే 199 మ్యాచ్‌లాడిన హిట్‌మ్యాన్ ఆ జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లాడిన ఆటగాడిగా ఉన్నాడు. 195 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిర రోహిత్ 5,084 పరుగులు చేశాడు. ఇందులో 34 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ ఉంది. అత్యధిక స్కోర్ 109*గా ఉంది. తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో రోహిత్ శర్మ డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ జట్లకు మాత్రమే ఆడాడు. కెరీర్ ఆరంభంలో తొలి మూడు సీజన్లలో డెక్కన్ చార్జర్స్ తరఫున 45 మ్యాచ్‌లు ఆడాడు. నాలుగో సీజన్ నుంచి ముంబై తరఫున ఆడుతున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున 189 మ్యాచ్‌లాడిన మాజీ ఆటగాడు కీరన్ పొలార్డ్ రోహిత్ శర్మ తర్వాతి స్థానంలో ఉన్నాడు. మొత్తంగా తన ఐపీఎల్ కెరీర్‌లో 244 మ్యాచ్‌లాడిన రోహిత్ శర్మ 6,254 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ, 42 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కెప్టెన్‌గా ముంబైని రోహిత్ శర్మ తిరుగులేని స్థానంలో నిలిపాడు. ఆరో సీజన్ నుంచి 16వ సీజన్ వరకు అంటే 11 సీజన్లలో ముంబై కెప్టెన్‌గా వ్యవహరించాడు. తన కెప్టెన్సీలో ముంబైని నంబర్ వన్ స్థానంలో నిలిపాడు. రికార్డు స్థాయిలో ఏకంగా ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలిపించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. కానీ ఈ సీజన్‌కు ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ అనూహ్యంగా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించింది. దీంతో ప్రస్తుతం ముంబైలో రోహిత్ శర్మ సాధారణ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Virat Kohli: టీ20 గేమ్ ప్రమోషన్‌కు నా పేరే వాడుతున్నారు.. వారికి కోహ్లీ సూపర్ అన్సర్
IPL 2024: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
Updated Date - Mar 27 , 2024 | 03:04 PM