IPL 2025 Mega Auction: తక్కువ ధరకే మొనగాడ్ని పట్టేసిన ముంబై.. రోహిత్‌తో ఓపెనింగ్ చేసేది ఇతడే
ABN, Publish Date - Nov 25 , 2024 | 04:43 PM
IPL 2025 Mega Auction: ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు నిర్వహిస్తున్న మెగా వేలంలో సంచలనాలు నమోదవుతున్నాయి. తోపు ప్లేయర్లు కూడా అన్‌సోల్డ్‌గా మిగులుతుండగా.. చిచ్చరపిడుగులు లాంటి ఆటగాళ్లు తక్కువ ధరకే అమ్ముడుపోతున్నారు.
జెడ్డా: ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు నిర్వహిస్తున్న మెగా వేలంలో సంచలనాలు నమోదవుతున్నాయి. తోపు ప్లేయర్లు కూడా అన్‌సోల్డ్‌గా మిగులుతుండగా.. చిచ్చరపిడుగులు లాంటి ఆటగాళ్లు తక్కువ ధరకే అమ్ముడుపోతున్నారు. ఫస్ట్ బాల్ నుంచే బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడే సౌతాఫ్రికా డాషింగ్ ఓపెనర్ ర్యాన్ డేవిడ్ రికల్టన్ కూడా తక్కువ ధరే పలికాడు. అతడ్ని రూ.1 కోటికి ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. దీంతో వచ్చే సీజన్‌లో రోహిత్ శర్మతో కలసి ఎంఐ తరఫున ఓపెనింగ్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు రికల్టన్.
ఫుల్ హ్యాపీ
తక్కువ ధరకే రికల్టన్ దక్కడంతో ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ ఫుల్ హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడికి సూపర్బ్ రికార్డు ఉంది. అక్కడ 62 మ్యాచుల్లో 49 యావరేజ్‌తో 4469 పరుగులు చేశాడు. ప్రొటీస్ తరఫున ఇంటర్నేషనల్ లెవల్‌లోనూ అతడు దుమ్మురేపుతున్నాడు. స్ట్రోక్ ప్లే, పించ్ హిట్టింగ్ చేసే సత్తా ఉండటం, వికెట్ కీపింగ్ ఎబిలిటీస్ కూడా ఉండటంతో ముంబై అతడ్ని జట్టులోకి తీసుకుంది.
Also Read:
పేరుకు తోపులు.. ఒక్కరూ అమ్ముడుపోలేదు
చిత్తుగా ఓడినా ఆసీస్ పొగరు తగ్గలేదు.. వీళ్లకు రోహితే కరెక్ట్ మొగుడు
ఐపీఎల్ వేలం మొదటి రోజు అమ్ముడైన 72 మంది ఆటగాళ్లు.. ఎక్కువ మొత్తం
For More Sports And Telugu News
Updated Date - Nov 25 , 2024 | 04:46 PM