IPL 2024: ఐపీఎల్‌కు ముందు కేకేఆర్ బ్యాటర్ల విధ్వంసం.. 237 పరుగుల భారీ స్కోర్
ABN, Publish Date - Mar 18 , 2024 | 05:30 PM
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ప్రారంభానికి మరో 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో ఫ్రాంచైజీలన్నీ తమ జట్లను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అన్ని జట్ల ఆటగాళ్లు నెట్స్ లో శ్రమిస్తున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు కూడా మైదానంలోకి దిగి చెమటోడ్చుతున్నారు.
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ప్రారంభానికి మరో 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో ఫ్రాంచైజీలన్నీ తమ జట్లను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అన్ని జట్ల ఆటగాళ్లు నెట్స్ లో శ్రమిస్తున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు కూడా మైదానంలోకి దిగి చెమటోడ్చుతున్నారు. గత సీజన్‌లో అంతగా ఆకట్టుకోని నైట్ రైడర్స్ ఈ సారి సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే తమ జట్టులోని ఆటగాళ్లందరినీ రెండు గ్రూపులుగా విభజించి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడించింది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. పిల్ సాల్ట్, నితీష్ రానా హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రింకూ సింగ్ ఎప్పటిలాగే డెత్ ఓవర్లలో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఆటగాళ్లను టీమ్ పర్పుల్, టీమ్ గోల్డ్ అనే రెండు జట్లుగా విభజించారు. ఫ్లాట్ పిచ్ కావడంతో రెండు జట్లు పరుగుల వరద పారించాయి. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ గోల్డ్ నిర్ణీత 20 ఓవర్లలో 237 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు బ్యాటర్లు పిల్ సాల్ట్ 41 బంతుల్లోనే 78, నితీష్ రానా 30 బంతుల్లోనే 50, రింకూ సింగ్ 16 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు.
అనంతరం లక్ష్యం భారీగా ఉన్నప్పటికీ టీం గోల్డ్ కూడా ధీటుగా పోరాడింది. దాదాపుగా లక్ష్యాన్ని చేధినంత పని చేసింది. కానీ నిర్ణీత 20 ఓవర్లలో 232 పరుగుల వద్దే ఆగిపోయింది. దీంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టీం గోల్డ్ 5 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో టీం పర్పుల్ తరఫున పలువురు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఆటగాళ్లు బరిలోకి దిగారు. గాయం కారణంగా గత సీజన్‌కు దూరమైన కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఈ సారి బరిలోకి దిగనున్నాడు. మరోవైపు కోల్ కతా కీలక బౌలర్ మిచెల్ స్టార్క్ ఆ జట్టు క్యాంపులో చేరాడు. ఈ సీజన్‌లో కోల్ కతా తమ తొలి మ్యాచ్‌ను ఈ నెల 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Mar 18 , 2024 | 05:31 PM