MI vs DC: టాస్ గెలిచిన ఢిల్లీ.. ముంబైలో కీలక మార్పులు
ABN, Publish Date - Apr 07 , 2024 | 03:15 PM
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు.
ముంబై: ఐపీఎల్ 2024లో(IPL 2024) భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Mumbai Indians vs Delhi Capitals) జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో ముంబై ఇండియన్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో ముంబై మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఆ జట్టు ప్రధాన బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) జట్టులోకి రావడం ముంబైకి కలిసొచ్చే అంశం. సూర్యను నమన్ ధీర్ ప్లేసులో తుది జట్టులోకి తీసుకున్నారు. అలాగే మఫాకా ప్లేసులో రొమారియో, బ్రెవిస్ ప్లేసులో నబీని తుది జట్టులోకి తీసుకున్నారు. అటు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఇక ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లు ఇప్పటివరకు 33 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. అత్యధికంగా ముంబై ఇండియన్స్ 18 మ్యాచ్‌ల్లో గెలవగా.. ఢిల్లీ 15 మ్యాచ్‌ల్లో గెలిచింది.
తుది జట్లు
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, మొహమ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, పీయూష్ చావ్లా, జెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, ఝై రిచర్డ్‌సన్, అన్రిచ్ నార్ట్జే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
SRH vs CSK: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. సీఎస్కే ఓడిపోయిందని ఏకంగా..
SRH vs CSK: ధోని క్రీజులోకి రాకుండా కమిన్స్ వ్యూహం పన్నాడా..? అందుకే రివ్యూకు వెళ్లలేదా..?
Updated Date - Apr 07 , 2024 | 03:29 PM