Siraj vs Head: తప్పంతా హెడ్‌దే.. ఓవరాక్షన్ చేస్తున్నాడు: సిరాజ్
ABN , Publish Date - Dec 09 , 2024 | 11:32 AM
Siraj vs Head: ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ మీద సీరియస్ అయ్యాడు మహ్మద్ సిరాజ్. ఓవరాక్షన్ చేస్తే ఊరుకోనంటూ ఫైర్ అయ్యాడు. చేసిన తప్పును అతడు ఒప్పుకోవాలని తెలిపాడు.
IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మ్యాచ్ మ్యాచ్‌కు మరింత హీటెక్కుతోంది. రిజల్ట్, ప్లేయర్ల పెర్ఫార్మెన్స్ కంటే వివాదాలే సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారిపోయాయి. అటు భారత ఆటగాళ్లు, ఇటు ఆస్ట్రేలియా ప్లేయర్లు.. ఢీ అంటే ఢీ అంటుండటంతో సిరీస్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. దీనికి కంగారూ ఆడియెన్స్ కూడా జతవడంతో అందరి ఫోకస్ బీజీటీ మీదే ఉంది. అడిలైడ్ టెస్ట్‌లో జరిగిన రచ్చే క్రికెట్ లవర్స్ దృష్టి ఇటు మరలడానికి కారణం. భారత పేసర్ మహ్మద్ సిరాజ్, ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన ఫైట్ కాంటవర్సీకి దారితీసింది. ఇద్దరూ ఒకర్నొకరు తిట్టుకోవడం కెమెరాల కంటికి చిక్కింది. దీంతో అసలు తప్పు ఎవరిదనేది ఎవరికీ అర్థం కావడం లేదు.
నెత్తురు మరిగింది
పింక్ బాల్ టెస్ట్ ఘటనపై సిరాజ్ స్పందించాడు. తప్పంతా హెడ్‌దే అని అన్నాడు. ఔట్ చేశాక తాను సైలెంట్‌గా ఉన్నానని.. అతడే కావాలని తిట్టాడని మియా రివీల్ చేశాడు. బాగా బౌలింగ్ చేశానని మెచ్చుకున్నానంటూ అతడు కవర్ చేస్తున్నాడని.. కానీ హెడ్ అలా అనలేదని సిరాజ్ క్లారిటీ ఇచ్చాడు. మ్యాచ్‌లో హెడ్‌తో ఇంట్రెస్టింగ్ వార్ నడిచిందన్నాడు. అతడు భారీ షాట్లు ఆడుతుంటే నెత్తురు మరిగిందన్నాడు. మొత్తానికి ఔట్ చేయడంతో హ్యాపీ ఫీల్ అయ్యానన్నాడు సిరాజ్. వికెట్ తీశాక తాను సెలబ్రేట్ చేసుకున్నాని.. అతడ్ని ఏమీ అనలేదని స్పష్టం చేశాడు. ఓవరాక్షన్ చేస్తే ఊరుకునేది లేదన్నాడు.
ముమ్మాటికీ తప్పే
‘వికెట్ తీశాక నేను సెలబ్రేషన్స్‌లో మునిగిపోయా. హెడ్‌ను ఏమీ అనలేదు. కానీ అతడు నన్ను తిట్టాడు. వెల్ బౌల్డ్ అని మెచ్చుకున్నానని అంటున్నాడు. అది పూర్తిగా అవాస్తవం. అతడు ఆ మాటే అనలేదు. మేం ప్రతి ప్లేయర్‌కు గౌరవం ఇస్తాం. ఎవరితో ఎలా నడుచుకోవాలో అలాగే వ్యవహరిస్తాం. హెడ్ చేసింది ముమ్మాటికీ తప్పు. అందుకే అతడితో నేనూ దూకుడుగా ఉన్నా’ అని సిరాజ్ స్పష్టం చేశాడు. టీమిండియా తిరిగి కమ్‌బ్యాక్ ఇస్తుందన్నాడు. కాగా, పెర్త్ టెస్ట్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టిన మెన్ ఇన్ బ్లూ.. పింక్ బాల్ టెస్ట్‌లో మాత్రం 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ రిజల్ట్ కంటే కూడా సిరాజ్ వర్సెస్ హెడ్ కాంట్రవర్సీ గురించే జోరుగా చర్చ నడుస్తోంది.
Also Read:
రెచ్చగొడితే ఊరుకోవాలా.. బరాబర్ తిడతాం అంటున్న రోహిత్
పీకల మీదకు తెచ్చుకున్న గంభీర్.. అంతా స్వయంకృతమే
సెమీస్‌లో శ్రీకాంత్, గాయత్రి జోడీ
For Sports And Telugu News