ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cricket: ఆటగాడిగా విఫలం.. కోచ్‌గా రాణిస్తారా.. శ్రీలంకపై గంభీర్ ప్రతీకారం తీర్చుకుంటారా..!

ABN, Publish Date - Jul 27 , 2024 | 10:08 AM

భారత క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఎన్నో విజయాలు అందించిన గౌతమ్ గంభీర్ కోచ్‌గా తన కొత్త బాధ్యతలను నిర్వహించడానికి సిద్ధమయ్యాడు. శ్రీలంకతో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సీరిస్ ఆడనుంది. శనివారం మొదటి మ్యాచ్ జరగనుంది.

Gambhir

భారత క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఎన్నో విజయాలు అందించిన గౌతమ్ గంభీర్ కోచ్‌గా తన కొత్త బాధ్యతలను నిర్వహించడానికి సిద్ధమయ్యాడు. శ్రీలంకతో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సీరిస్ ఆడనుంది. శనివారం మొదటి మ్యాచ్ జరగనుంది. శ్రీలంక పర్యటనతో గంభీర్ తన కోచ్ బాధ్యతలను ప్రారంభిచనున్నారు. ఈ సిరీస్‌తో టీమిండియా హెడ్‌ కోచ్‌‌గా గౌతమ్‌ గంభీర్‌ పదవీకాలం ప్రారంభం కానుంది. గౌతమ్ గంభీర్‌కు శ్రీలంక ఎంతో ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఇప్పటివరకు రెండు టీ20 మ్యాచ్‌లు ఆడగా.. గంభీర్ పెద్దగా రాణించలేదు. దీంతో కోచ్‌గా గౌతమ్ గంభీర్ తన ఇన్నింగ్స్‌ను శ్రీలంక గడ్డపై ప్రారంభించడం ఆసక్తి రేపుతోంది. గంభీర్ గత ఆటతీరు చూస్తే మాత్రం శ్రీలంక గడ్డపై చెప్పుకోదగ్గ సక్సెస్ రేటు లేదు. అయినప్పటికీ గతంతో పోలిస్తే భారత్ బలమైన జట్టుగా ఎదిగింది. శ్రీలకం జట్టు కొంచెం బలహీనపడింది. దీంతో శ్రీలంతో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంపై భారత్ దృష్టి పెట్టింది.

T20 World Champion : కొత్త.. కొత్తగా


ప్రతీకారం తీర్చుకుంటాడా..

గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టు సభ్యుడిగా 37 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను శ్రీలంకతో రెండు టీ20 ఆడాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ పెద్దగా రాణించలేకపోయాడు. 2009, 2012లో శ్రీలంకతో రెండు మ్యాచ్‌లు గంభీర్ ఆడారు. ఈ రెండు మ్యాచ్‌లలో కలిపి అతను 9.50 సగటుతో 19 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఒక మ్యాచ్‌లో 13 పరుగులు చేసి క్యాచ్ అవుట్ కాగా, రెండో మ్యాచ్‌లో 6 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కోచ్‌గా అతనికి కొత్త సవాల్‌ ఎదురుకానుంది. గంభీర్‌కు కోచ్‌ అనుభవం ఉన్నప్పటికీ తొలిసారిగా అంతర్జాతీయ జాతీయ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతని నేతృత్వంలో భారత జట్టు ఎలా రాణిస్తుందనే ఆసక్తిగా మారింది.

Olympic Games : ఆరంభ సంబరం పారిస్‌ పరవశం


కొత్త కోచ్.. కొత్త కెప్టెన్..

శ్రీలంకతో టీ20 సిరీస్ ద్వారా కొత్త హెడ్ కోచ్‌తో పాటు టీమ్ ఇండియా కూడా కొత్త కెప్టెన్‌తో రంగంలోకి దిగనుంది. ఈ సిరీస్ నుంచి భారత టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. అదే సమయంలో, వైస్ కెప్టెన్ బాధ్యతలను శుభ్‌మన్ గిల్‌కు అప్పగించారు. ప్రస్తుతం ఈ కొత్త త్రయం టీ20లో భారతజట్టును ఎలా ముందుకు తీసుకెళ్తుందనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. 2026లో జరిగే టీ20 ప్రపంచకప్‌ వరకు సూర్యకుమార్ యాదవ్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఉండే అవకాశం ఉందని క్రికెట్ అభిమానులు విశ్వసిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్‌కు ఈ సిరీస్ చాలా కీలకం కానుంది. భారత్-శ్రీలంక టీ20 సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్ పల్లెకెలె వేదికగా రాత్రి 7గంటలకు జరగనుంది.


వేలంలో ద్రవిడ్‌ కొడుక్కి రూ.50 వేలు

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Sports News and Latest Telugu News

Updated Date - Jul 27 , 2024 | 10:08 AM

Advertising
Advertising
<