Narendra Modi: సచిన్ జమ్మూ కశ్మీర్ పర్యటనపై స్పందించిన ప్రధాని మోదీ
ABN, Publish Date - Feb 28 , 2024 | 08:58 PM
భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ జమ్మూకశ్మీర్ పర్యటనలో ఆనందంగా గడుపుతున్నారు. భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి కశ్మీర్‌లోని అందమైన ప్రదేశాలన్నింటిని చుట్టేస్తున్నారు. స్థానికంగా ఉన్న ఆలయాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించారు.
భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ జమ్మూకశ్మీర్ పర్యటనలో ఆనందంగా గడుపుతున్నారు. భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి కశ్మీర్‌లోని అందమైన ప్రదేశాలన్నింటిని చుట్టేస్తున్నారు. స్థానికంగా ఉన్న ఆలయాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించారు. పుల్వామా జిల్లాలోని క్రికెట్ బ్యాట్ల తయారీ యూనిట్‌కు వెళ్లారు. కశ్మీర్ పారా క్రికెట్ జట్టు కెప్టెన్ అమీర్ హుస్సేన్‌ను ప్రత్యేకంగా కలిసి అభినందించారు. అంతేకాకుండా తన అందమైన జమ్మూ కశ్మీర్ పర్యటనకు సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతంలో చెప్పిన మాటలను సచిన్ తన ట్వీట్లో ప్రస్తావించారు. దీనిపై ప్రధాని మోదీ సైతం స్పందించారు. ఈ సందర్భంగా సచిన్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు.
‘‘జమ్మూ కశ్మీర్ పర్యటన నా జ్ఞాపకంలో ఒక అందమైన అనుభవంగా మిగిలిపోతుంది. చుట్టూ మంచు ఉంది. కానీ ప్రజల అసాధారణమైన ఆతిథ్యం కారణంగా మేము వెచ్చగా ఉన్నాము. వారి అతిథ్యం మమ్మల్ని మైమరిపించింది. మనదేశంలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయని గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ముఖ్యంగా నా ఈ పర్యటన తర్వాత ఆయన మాటలతో అంగీకరించకుండా ఉండలేకపోతున్నాను. కశ్మీర్ విల్లో గబ్బిలాలు మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ కి గొప్ప ఉదాహరణలు. అవి ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించాయి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు జమ్మూ కశ్మీర్లో పర్యటించాలని నేను కోరుతున్నాను.’’ అని సచిన్ ట్వీట్ చేశారు. దీనిపై మోదీ స్పందిస్తూ.. ‘‘సచిన్ జమ్మూ కశ్మీర్ పర్యటన అద్భుతంగా ఉంది. మనోహరమైన సచిన్ పర్యటనలో మన యువత తెలుసుకోవాల్సిన రెండు ముఖ్యమైన అంశాలున్నాయి. ఒకటి- ఇన్క్రెడిబుల్ ఇండియాలోని వివిధ భాగాలను కనుగొనడం. రెండోది మేకిన్ ఇండియా ప్రాముఖ్యత. విక్షిత్, ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించుకుందాం.’’ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సచిన్, మోదీ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 28 , 2024 | 08:58 PM