ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cricket: మరో సచిన్‌ అవుతాడనుకుంటే అన్‌సోల్డ్‌గా మిగిలాడు.. చేజేతులా ఓడిన కర్ణుడి కథ

ABN, Publish Date - Nov 29 , 2024 | 05:50 PM

Cricket: నెక్స్ట్ సచిన్ అన్నారు, లారా వారసుడు వచ్చేశాడు అన్నారు. క్రికెట్‌లో అతడే తదుపరి స్టార్ అని అంచనా వేశారు. కానీ అవన్నీ తప్పని తేలింది. ఎంతో ప్రతిభ కలిగిన ఆ అభినవ కర్ణుడు చేజేతులా ఓడాడు.

నెక్స్ట్ సచిన్ అన్నారు, లారా వారసుడు వచ్చేశాడు అన్నారు. క్రికెట్‌లో అతడే తదుపరి స్టార్ అని అంచనా వేశారు. వచ్చే దశాబ్దం అతడిదే అని.. టీమిండియాను అతడే ముందుకు తీసుకెళ్తాడని ఊదరగొట్టారు. కానీ అవన్నీ తప్పని తేలింది. ఎంతో ప్రతిభ కలిగిన ఆ అభినవ కర్ణుడు చేజేతులా ఓడాడు. ఇంటర్నేషనల్ మ్యాచులు పక్కనబెడితే.. ఐపీఎల్‌లో కూడా ఆడే అవకాశాన్ని కూడా కోల్పోయాడు. రీసెంట్‌గా జరిగిన మెగా ఆక్షన్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలాడు. అటు దేశవాళీ క్రికెట్‌లోనూ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. 25 ఏళ్లకే అతడి కెరీర్ డేంజర్‌లో పడింది. ఇంతకీ ఎవరా ఆటగాడు? అనేది ఇప్పుడు చూద్దాం..


టాలెంట్ వృథా

నెక్స్ట్ సచిన్ అని అటు మాజీ క్రికెటర్లతో పాటు ఇటు అనలిస్టులతోనూ ప్రశంసలు అందుకున్న ఆ ప్లేయర్ మరెవరో కాదు.. పృథ్వీ షా. చిన్న వయసులోనే అందరి దృష్టిని ఆకర్షించాడు షా. అండర్-19 వరల్డ్ కప్-2018లో భారత జట్టును విజేతగా నిలబెట్టాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అదరగొట్టాడు. దీంతో అదే ఏడాది అటు ఐపీఎల్‌లో ఇటు ఇండియన్ టీమ్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. కెరీర్ మొదట్లో అతడి బ్యాటింగ్ స్కిల్స్ చూసి తోపు ఆటగాళ్లు కూడా షాక్ అయ్యారు. బంతిని అతడు టైమ్ చేసే విధానం, టెక్నిక్‌కు ఫిదా అయిపోయారు. ఇలాంటి బ్యాటర్‌ను కెరీర్‌లోనే చూడలేదంటూ రికీ పాంటింగ్ లాంటి దిగ్గజాలు పొగడ్తల వర్షం కురిపించారు. దీంతో వరల్డ్ క్రికెట్‌లో సంచలన ప్లేయర్ వచ్చేశాడంటూ అందరూ ప్రశంసల్లో ముంచెత్తారు.


ఆకాశం నుంచి పాతాళానికి..

ఎంత ప్రతిభ ఉన్నా క్రమశిక్షణ, నిరంతం మెరుగుపడాలి, నేర్చుకోవాలనే తపన ఉండాలని పెద్దలు అంటుంటారు. అలాగే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెబుతుంటారు. కానీ పృథ్వీ షాలో ఇవే లోపించాయి. భారత జట్టులోకి ఎంత వేగంగా వచ్చాడో.. అంతే వేగంగా వెళ్లిపోయాడు షా. ఒకట్రెండు మంచి ఇన్నింగ్స్‌లు ఆడినా, అవకాశాలు తగ్గిపోవడంతో అతడు కమ్‌బ్యాక్ ఇవ్వలేకపోయాడు. చిన్న వయసులోనే కోట్లు వచ్చిపడటంతో పొగరు పెరిగింది. సేమ్ టైమ్ క్రమశిక్షణ లేకపోవడం, బరువు పెరగడం, ఫామ్ కోల్పోవడం, గాయాలు తిరగబెట్టడం షాకు శాపాలుగా మారాయి. కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్నట్లు షా ఫెయిల్యూర్‌కు కూడా ఎన్నో రీజన్స్ ఉన్నాయి.


ఖేల్ ఖతం!

టీమిండియాలో రీఎంట్రీ కోసం షా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దేశవాళీతో పాటు విదేశాల్లో కౌంటీ క్రికెట్ ఆడినా నిలకడగా పరుగులు చేయలేకపోయాడు. ఫుట్‌వర్క్, షాట్ సెలెక్షన్‌లో లోపాల కారణంగా అతడిలో కన్‌సిస్టెన్సీ తగ్గింది. దీనికి తోడు నిర్లక్ష్య వైఖరి, క్రమశిక్షణ లోపించడం కూడా మైనస్‌గా మారింది. ఈ కారణాల వల్ల ముంబై టీమ్‌కు అతడు దూరమయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్‌లోనూ అతడికి అదే పరిస్థితి తలెత్తింది. గత ఆరేళ్లుగా ప్రోత్సహిస్తూ వస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ అతడ్ని వదిలేసింది. వేలంలో ఎవరూ కొనకపోవడంతో 25 ఏళ్లకే షా కెరీర్ క్లోజ్ అని వినిపిస్తోంది. మళ్లీ డొమెస్టిక్ క్రికెట్‌లో అదరగొడితే తప్ప అతడు ఐపీఎల్‌లోకి కమ్‌బ్యాక్ ఇవ్వడం కష్టంగా కనిపిస్తోంది. ఐపీఎల్‌లో రాణిస్తే తప్ప సెలెక్టర్లు పట్టించుకునేలా లేరు. ఇప్పుడు ఉన్న కాంపిటీషన్‌లో టీమిండియా సంగతి దేవుడెరుగు! అతడు ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇచ్చినా గొప్పేనని చెప్పాలి.


Also Read:

పంత్, అయ్యర్ కాదు.. ఐపీఎల్‌లో అత్యధిక ప్యాకేజ్ ఇతడికే..

రాసి పెట్టుకోండి.. ఆర్సీబీకి అతడే కెప్టెన్: ఏబీ డివిలియర్స్

అరెరె.. కోహ్లీకి ఇలా జరిగిందేంటి.. ఇక్కడ కూడా అతడి డామినేషనేనా..

For More Sports And Telugu News

Updated Date - Nov 29 , 2024 | 05:53 PM