ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: హాఫ్ సెంచరీతో చెలరేగిన కర్రాన్.. పంజాబ్ సూపర్ విక్టరీ

ABN, Publish Date - Mar 23 , 2024 | 07:38 PM

ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో రాణించిన పంజాబ్ ఢిల్లీపై 4 వికెట్ల తేడాతో గెలిచింది. హాఫ్ సెంచరీతో చెలరేగిన సామ్ కర్రాన్(63) పంజాబ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. లివింగ్‌స్టోన్(38) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు నెలకొల్పిన హాఫ్ సెంచరీ భాగస్వామ్యం జట్టును గెలుపు బాట పట్టింది.

ఛండీగడ్: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో రాణించిన పంజాబ్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచింది. హాఫ్ సెంచరీతో చెలరేగిన సామ్ కర్రాన్(63) పంజాబ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. లివింగ్‌స్టోన్(38) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు నెలకొల్పిన హాఫ్ సెంచరీ భాగస్వామ్యం జట్టును గెలుపు బాట పట్టింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో ధాటిగా ప్రారంభించారు. 4 ఫోర్లతో 16 బంతుల్లో 22 పరుగులు చేసిన ధావన్‌ను ఢిల్లీ సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ నాలుగో ఓవర్‌లో అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 3.1 ఓవర్లలో 34 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే మరో ఓపెనర్ బెయిర్‌స్టో(9) రనౌట్ అయ్యాడు. దీంతో 42 పరుగులకే పంజాబ్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.

అనంతరం ప్రభుసిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్ మూడో వికెట్‌కు 42 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యాన్ని 10వ ఓవర్‌లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విడదీశాడు. 5 ఫోర్లతో 17 బంతుల్లోనే 26 పరుగులు చేసిన ప్రభుసిమ్రాన్ సింగ్‌ను ఔట్ చేశాడు. ఆ కాసేపటికే జితేష్ శర్మ(9)ను సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేర్చాడు. దీంతో 11.3 ఓవర్లలో 100 పరుగులకు పంజాబ్ 4 వికెట్లు కోల్పోయింది. పంజాబ్ గెలవాలంటే 51 బంతుల్లో 75 పరుగులు చేయాల్సి ఉండడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి సమయంలో పంజాబ్‌ను సామ్ కర్రాన్, లియామ్ లివింగ్ స్టోన్ ఆదుకున్నారు. వీరిద్దరు చెలరేగి ఆడారు. ఈ క్రమంలో సామ్ కర్రాన్ 39 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ సీజన్‌లో హాఫ్ సెంచరీ చేసిన మొదటి బ్యాటర్‌గా నిలిచాడు. మొత్తంగా ఐపీఎల్‌లో కర్రాన్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ.

పంజాబ్ విజయానికి చివరి 4 ఓవర్లలో 39 పరుగులు అవసరం అయ్యాయి. ఖలీల్ అహ్మద్ వేసిన 17వ ఓవర్‌లో లివింగ్ స్టోన్ 2 ఫోర్లు బాదడంతో 11 పరుగులొచ్చాయి. మిచెల్ మార్ష్ వేసిన 18వ ఓవర్‌లో కర్రాన్ ఓ ఫోర్, ఓ సిక్సు.. లివింగ్ స్టోన్ ఓ సిక్సు బాదడంతో 18 పరుగులొచ్చాయి. దీంతో సమీకరణం చివరి 2 ఓవర్లలో 10 పరుగులుగా మారింది. ఇక పంజాబ్ విజయం ఖాయమనుకున్న సమయంలో 19వ ఓవర్‌లో ఢిల్లీ పేసర్ ఖలీల్ అహ్మద్ చెలరేగాడు. హాఫ్ సెంచరీతో చెలరేగుతున్న కర్రాన్‌తోపాటు శశాంక్ సింగ్‌ను గోల్డెన్ డకౌట్ చేశాడు. దీంతో 167 పరుగులకు పంజాబ్ 6 వికెట్లు కోల్పోయింది. 6 ఫోర్లు, ఒక సిక్సుతో 47 బంతుల్లో కర్రాన్ 63 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఆ ఓవర్‌లో 4 పరుగులే ఇచ్చాడు. అయితే హర్‌ప్రీత్ బ్రార్ ఇచ్చిన క్యాచ్‌ను వార్నర్ నేలపాలు చేశాడు. దీంతో ఖలీల్ అహ్మద్‌ హ్యాట్రిక్ వికెట్లు దక్కించుకునే అవకాశాన్ని కోల్పోయాడు. ఇక చివరి ఓవర్‌లో లివింగ్ స్టోన్ సిక్సు కొట్టడంతో ఢిల్లీపై పంజాబ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. 2 ఫోర్లు, 3 సిక్సులతో 21 బంతుల్లోనే 38 పరుగులు చేసిన లివింగ్ స్టోన్, హర్‌ప్రీత్ బ్రార్(2) నాటౌట్‌గా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీశాడు.


అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ శుభారంభాన్ని అందించారు. ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించిన వీరిద్దరు తొలి వికెట్‌కు 3.2 ఓవర్లలోనే 39 పరుగులు జోడించారు. 2 ఫోర్లు, 2 సిక్సులతో 12 బంతుల్లోనే 20 పరుగులు చేసిన మార్ష్‌ను 4వ ఓవర్‌లో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ పెవిలియన్ చేర్చాడు. అనంతరం షాయ్ హోప్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన వార్నర్ రెండో వికెట్‌కు 35 పరుగులు జోడించాడు. 3 ఫోర్లు, 2 సిక్సులతో 21 బంతుల్లో 29 పరుగులు చేసిన వార్నర్‌ను 8వ ఓవర్ చివరి బంతికి పేసర్ హర్షల్ పటేల్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 74 పరుగులకు ఢిల్లీ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. అనంతరం కెప్టెన్ రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న పంత్ మళ్లీ మైదానంలోకి రావడం ఇదే మొదటిసారి. ఆ కాసేపటికే 2 ఫోర్లు, 2 సిక్సులతో 25 బంతుల్లో 33 పరుగులు చేసిన షాయ్ హోప్‌ను 11వ ఓవర్‌లో మరో పేసర్ హర్షల్ పటేల్ పెవిలియన్ చేర్చాడు. అనంతరం రికీ భూయితో కలిసి జట్టు స్కోర్‌ను పంత్ 100 పరుగులు దాటించాడు. అయితే మరో సారి చెలరేగిన హర్షల్ పటేల్ 13వ ఓవర్‌లో రిషబ్ పంత్‌ను ఔట్ చేశాడు. 13 బంతులు ఎదుర్కొన్న పంత్ 2 ఫోర్లతో 18 పరుగులు చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే 3 పరుగులు చేసిన రికీ భుయ్‌ను హర్‌ప్రీత్ బ్రార్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 111 పరుగులకే ఢిల్లీ సగం వికెట్లు కోల్పోయింది.

త్రిస్టన్ స్టబ్స్(5), సుమిత్ కుమార్(2) కూడి సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. అయితే 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 13 బంతుల్లోనే 21 పరుగులు చేసిన అక్షర్ పటేల్ రనౌట్ అయ్యాడు. దీంతో 147 పరుగులకే ఢిల్లీ 8 వికెట్లు కోల్పోయింది. దీంతో ఢిల్లీ స్కోర్ 150 దాటితే అదే ఎక్కువ అనిపించింది. ఇలాంటి సమయంలో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అభిషేక్ పోరెల్ చెలరేగాడు. హర్షల్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 25 పరుగులు రాబట్టాడు. అభిషేక్ మెరుపులతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. 4 ఫోర్లు, 2 సిక్సులతో 10 బంతుల్లోనే 32 పరుగులు చేసిన అభిషేక్ నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు.. రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్, రబాడ తలో వికెట్ తీశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024: వ్యూయర్‌షిప్‌లో చెన్నై vs బెంగళూరు మ్యాచ్ రికార్డు.. గతేడాదితో పోలిస్తే ఏకంగా..

SRH vs KKR: టాస్ గెలిచిన హైదరాబాద్.. తుది జట్టు ఇదే!



Updated Date - Mar 23 , 2024 | 07:57 PM

Advertising
Advertising