Yashasvi Jaiswal: జైస్వాల్ విషయంలో తప్పు చేశా.. ద్రవిడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ABN, Publish Date - Nov 28 , 2024 | 04:21 PM
Yashasvi Jaiswal: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. పెర్త్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై పిడుగులా విరుచుకుపడిన ఈ డాషింగ్ లెఫ్టాండర్.. అడిలైడ్‌లోనూ కంగారూల మెడలు వంచాలని చూస్తున్నాడు.
టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. పెర్త్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై పిడుగులా విరుచుకుపడిన ఈ డాషింగ్ లెఫ్టాండర్.. అడిలైడ్‌లోనూ కంగారూల మెడలు వంచాలని చూస్తున్నాడు. మొదటి టెస్ట్‌లో భారీ సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. రెండో మ్యాచ్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగించాలని చూస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఆసీస్‌కు పుంజుకునే అవకాశం ఉండదు. అందుకే ఇక్కడ ఆతిథ్య జట్టు కథ ముగించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఇందులో జైస్వాల్‌ను కీలక ఆయుధంగా వాడాలని భావిస్తోంది. రోహిత్ సేన ఈ కుర్ర క్రికెటర్‌పై భారీ ఆశలు పెట్టుకున్న వేళ.. మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అంత ఈజీ కాదు
జైస్వాల్ విషయంలో తాను తప్పు చేశానని ద్రవిడ్ అన్నాడు. అతడ్ని చాలా తక్కువ అంచనా వేశానని చెప్పాడు. ఏడాదిన్నర కిందట జట్టులోకి వచ్చిన కొత్తలో జైస్వాల్ తడబడ్డాడని.. దీంతో అతడు కెరీర్‌లో ఎంత వరకు చేరుకోగలడదనేది కాస్త అనుమానంగా ఉండేదన్నాడు. కానీ మొదటి సిరీస్ తర్వాత నుంచి భారీ ఇన్నింగ్స్‌లు ఆడటం, నాటౌట్‌గా నిలబడటం, మ్యాచ్‌లు ముగించడం అతడు నేర్చుకున్నాడని మెచ్చుకున్నాడు. పెర్త్ టెస్ట్‌లో సెంచరీ కొట్టడం అంటే మాటలు కాదని.. చాలా మంది తోపు క్రికెటర్లకు కూడా ఇది సాధ్యం కాలేదన్నాడు ద్రవిడ్.
ఊహించడమూ కష్టమే
‘జైస్వాల్‌లో పరుగుల దాహం ఎక్కువ. పెర్త్ టెస్ట్‌లో అతడు ఆడిన తీరు అద్భుతం. అక్కడ సెంచరీ చేయడం మామూలు విషయం కాదు. కానీ అతడు సులువుగా బాదేశాడు. అతడు రోజురోజుకూ మరింత స్ట్రాంగ్ అవుతున్నాడు. వెస్టిండీస్ మీద ఏడాదిన్నర కింద డెబ్యూ ఇచ్చిన ప్లేయర్.. ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయికి చేరుకోవడం ఊహించడానికి కూడా కష్టంగా ఉంది. అతడి విషయంలో గర్వంగా ఉన్నా’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. జైస్వాల్ ఎప్పటికప్పుడు తనను తాను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టడం మంచి విషయమని మాజీ కోచ్ పేర్కొన్నాడు.
Also Read:
చేతిలో కత్తితో సీరియస్‌గా కోహ్లీ.. అంత కోపం ఎవరి మీదంటే..
ఆర్సీబీపై భగ్గుమంటున్న కన్నడ ఫ్యాన్స్
ఆస్ట్రేలియా ప్రధానితో టీమిండియా.. కోహ్లీతో ఏం మాట్లాడారు..
For More Sports And Telugu News
Updated Date - Nov 28 , 2024 | 05:02 PM