Share News

Ravichandran Ashwin: అశ్విన్ భార్య ఎమోషనల్.. దాని గురించే ఆలోచిస్తున్నానంటూ..

ABN , Publish Date - Dec 21 , 2024 | 02:00 PM

Ravichandran Ashwin: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ రిటైర్మెంట్‌పై అతడి భార్య రియాక్ట్ అయింది. దాని గురించే ఆలోచిస్తున్నానంటూ ఆమె ఎమోషనల్ అయింది.

Ravichandran Ashwin: అశ్విన్ భార్య ఎమోషనల్.. దాని గురించే ఆలోచిస్తున్నానంటూ..
Ravichandran Ashwin

టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ రిటైర్మెంట్‌ను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దశాబ్ద కాలానికి పైగా భారత జట్టు స్పిన్ భారాన్ని మోసిన దిగ్గజం.. సెండాఫ్ మ్యాచ్ ఆడకుండానే రిటైర్ అవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఉన్నపళంగా సిరీస్ మధ్యలో నుంచి నిష్క్రమించాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఏళ్ల పాటు జట్టును విజయాల బాటలో నడిపినోడు.. రెండు మ్యాచుల వైఫల్యానికి ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవడం ఏంటని షాక్ అవుతున్నాడు. అశ్విన్ రిటైర్మెంట్‌పై తాజాగా అతడి భార్య రియాక్ట్ అయింది.


ఏం చెప్పాలి?

అశ్విన్ రిటైర్మెంట్‌పై అతడి సతీమణి ప్రీతి నారాయణన్ ఎమోషనల్ అయింది. రెండ్రోజుల నుంచి తనకు దిక్కుతోచడం లేదని.. నిద్రపట్టడం లేదని చెప్పింది. ఏం చెప్పాలా? అని ఆలోచిస్తున్నానని.. తన ఫేవరెట్ క్రికెటర్ గురించి చెప్పాలా? లేదా లైఫ్ పార్ట్‌నర్ గురించి చెప్పాలా? అనేది తేల్చుకోలేకపోతున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగభరిత పోస్ట్ పెట్టింది. ఇన్నాళ్ల వైవాహిక జీవితంలో తమ మధ్య అనుబంధం, అశ్విన్ సాధించిన విజయాలతో పాటు మరికొన్ని విశేషాలను ఆమె అందులో షేర్ చేసింది.


గర్వంగా ఉన్నాను

ఛాంపియన్స్ ట్రోఫీ-2013 ఫైనల్‌లో టీమిండియా విక్టరీ కొట్టిన తర్వాత సంతోషంతో తాము కన్నీళ్లు పెట్టుకున్నామని అశ్విన్ భార్య తెలిపింది. మెల్‌బోర్న్, గబ్బా టెస్టుల్లో గెలుపు.. టీ20 ఫార్మాట్‌లోకి అశ్విన్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఎమోషనల్ అయ్యామని ఆమె గుర్తుచేసింది. క్రికెట్ విషయంలో తన భర్త ఎంత నిబద్ధతతో ఉండేవాడో చెప్పుకొచ్చింది. క్రికెటర్‌గా అశ్విన్ ఇప్పటివరకు సాధించిన ఘనతలు, అందుకున్న మైలురాళ్లు, పోరాడిన విధానంపై గర్వంగా ఉన్నానని పేర్కొంది. రిటైర్మెంట్ తర్వాత ఫ్యామిలీతో మరింత సమయం గడుపుతాడని ఆశిస్తున్నానని వివరించింది. క్రికెట్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన ప్రీతి నారాయణన్.. అశ్విన్ వల్ల ఆ ప్రపంచం గురించి మరింత తెలుసుకున్నానని వ్యాఖ్యానించింది. ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్‌ సక్సెస్ అవ్వాలంటే ఎంత పరిశ్రమించాలి, ఎంత క్రమశిక్షణతో ఉండాలి, ఎంత ప్యాషన్ అవసరం అనేది అర్థం చేసుకున్నానని స్పష్టం చేసింది.


Also Read:

టీమిండియా క్రికెటర్‌పై అరెస్ట్ వారెంట్.. ఎందుకంటే..

అశ్విన్ మోసం చేశాడు.. ఇలాంటోడు అనుకోలేదు: జడేజా

జహీర్‌..ఈ బాలిక బౌలింగ్‌ చూశావా?

టైటాన్స్‌ను గెలిపించిన పవన్

For More Sports And Telugu News

Updated Date - Dec 21 , 2024 | 02:09 PM