ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mohammed Siraj: మళ్లీ ఆర్సీబీలోకి సిరాజ్.. మియాపై ప్రేమ చంపుకోని బెంగళూరు

ABN, Publish Date - Nov 27 , 2024 | 05:48 PM

Mohammed Siraj: ఏడేళ్లుగా ఆర్సీబీకి ఆడుతున్న పేసర్ మహ్మద్ సిరాజ్ వచ్చే సీజన్‌లో కొత్త రంగు జెర్సీ వేసుకోబోతున్నాడు. గుజరాత్ టైటాన్స్ తరపున బరిలోకి దిగనున్నాడు మియా.

ఫ్రాంచైజీ క్రికెట్‌లో లాయల్టీ అనే పదానికి అంతగా విలువ ఉండదు. కానీ కొందరు ఆటగాళ్లు మాత్రం విశ్వాసానికి మారుపేరుగా నిలుస్తారు. అలాంటి వారిలో స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ ఒకడని చెప్పొచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఒకే జట్టు తరఫున ఏడేళ్లుగా ఆడుతూ వస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్ బెంగళూరు టీమ్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. అయితే వచ్చే సీజన్‌లో మాత్రం కొత్త రంగు జెర్సీ వేసుకోబోతున్నాడు మియా. గుజరాత్ టైటాన్స్ తరపున బరిలోకి దిగనున్నాడు. అయితే సిరాజ్ మళ్లీ ఆర్సీబీలోకి రావడం ఖాయమని వినిపిస్తోంది. బెంగళూరును వీడినోడు మళ్లీ రావడం ఏంటి? ఈ వార్తలో నిజమెంత? అనేది ఇప్పుడు చూద్దాం..


ఒక్క పోస్ట్‌తో..

ఆర్సీబీతో ఏడేళ్ల బంధం ముగియడంతో సిరాజ్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. బెంగళూరు జెర్సీని ధరించిన రోజు, మొదటి బాల్ విసిరిన క్షణాలను మర్చిపోలేనన్నాడు. ఆర్సీబీ తనకు కేవలం ఫ్రాంచైజీ మాత్రమే కాదని.. అది తన సొంత కుటుంబం లాంటిదంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. సిరాజ్‌కు బెంగళూరు లైఫ్ ఇచ్చింది కాబట్టి అతడు అంత లవ్ పెంచుకున్నాడు కాబట్టి ఎమోషనల్ అవ్వడం కామన్ అని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. అయితే ఆర్సీబీ కూడా సిరాజ్ మీద ప్రేమ చంపుకోలేదని తాజా పోస్ట్‌తో బయటపడింది. నీ సేవలకు థ్యాంక్స్.. ఆన్ ఫీల్డ్‌తో పాటు ఆఫ్ ఫీల్డ్ కూడా నువ్వో స్టార్ అని బెంగళూరు ట్వీట్ చేసింది.


ఎన్ని ఆఫర్లు వచ్చినా..

నిన్ను తప్పకుండా మిస్ అవుతాం, లవ్ యూ అంటూ ఆర్సీబీ పోస్ట్ చేసింది. నువ్వో ఛాలెంజర్‌వి అంటూ అతడ్ని ప్రశంసల్లో ముంచెత్తింది. ఇది చూసిన నెటిజన్స్.. సిరాజ్‌ను మళ్లీ బెంగళూరు తీసుకుంటుందని, ఎప్పుడు చాన్స్ వచ్చినా అతడ్ని అస్సలు వదులుకోరని కామెంట్స్ చేస్తున్నారు. తాజా పోస్టే దీనికి ఎగ్జాంపుల్ అని అంటున్నారు. కాగా, ఆర్సీబీకి ఆడిన ఈ ఏడేళ్లలో ఇతర జట్ల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా సిరాజ్ బయటకు వెళ్లలేదు. అలాంటోడ్ని జట్టు వదిలేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే వేలంలో అతడ్ని తిరిగి సొంతం చేసుకుంటుందని అంతా భావించారు. కానీ అదీ జరగలేదు. దీంతో ఆక్షన్‌లో రూ.12.25 కోట్ల ధరకు సిరాజ్‌ను ఎగరేసుకుపోయింది గుజరాత్ టైటాన్స్.


Also Read:

మళ్లీ ఆసీస్ పొగరు అణిచిన బుమ్రా.. పుండు మీద కారం చల్లాడు

28 బంతుల్లోనే సెంచరీ.. అన్‌సోల్డ్ ప్లేయర్ ఆల్‌టైమ్ రికార్డ్

పంత్‌తో ప్యాచప్.. ఊర్వశి ప్రయత్నాలు ఫలించేనా..

For More Sports And Telugu News

Updated Date - Nov 27 , 2024 | 05:56 PM