Pant-Iyer: పంత్, అయ్యర్ కాదు.. ఐపీఎల్‌లో అత్యధిక ప్యాకేజ్ ఇతడికే..
ABN, Publish Date - Nov 29 , 2024 | 04:43 PM
Pant-Iyer: ఐపీఎల్ 2025కు ముందు నిర్వహించిన మెగా ఆక్షన్‌లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా పాత రికార్డులకు పాతర వేశారు.
ఐపీఎల్ 2025కు ముందు నిర్వహించిన మెగా ఆక్షన్‌లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. టీమిండియా స్టార్లు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా పాత రికార్డులకు పాతర వేశారు. పంత్‌ను రూ.27 కోట్ల భారీ ధర చెల్లించి లక్నో సూపర్ జియాంట్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. దీంతో లీగ్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా అతడు నిలిచాడు. అతడి తర్వాతి స్థానంలో అయ్యర్ ఉన్నాడు. అతడ్ని రూ.26.75 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది పంజాబ్ కింగ్స్. అయితే వీళ్లిద్దరూ కాదు.. ఐపీఎల్‌లో అత్యధిక శాలరీ హైక్ అందుకుంటున్న ప్లేయర్ మరొకరు ఉన్నారు. అతడు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
రికార్డు స్థాయిలో శాలరీ హైక్
టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ జితేష్ శర్మ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక శాలరీ హైక్ అందుకుంటున్న ఆటగాడిగా అతడు నిలిచాడు. గత ఐపీఎల్‌లో జితేష్ శాలరీ రూ.20 లక్షలు. కానీ వచ్చే సీజన్‌లో అతడు ఏకంగా రూ.11 కోట్లు అందుకోనున్నాడు. ఆర్సీబీ జట్టు అతడ్ని ఇంత భారీ మొత్తం వెచ్చింది వేలంలో దక్కించుకుంది. గత ఐపీఎల్‌తో పోలిస్తే నెక్స్ట్ సీజన్ కోసం ఏకంగా 55 రెట్ల అధిక వేతనాన్ని పొందనున్నాడు జితేష్. మొత్తంగా అతడి శాలరీ హైక్ 5500 శాతంగా ఉంది.
సెకండ్ ప్లేస్‌లో పంజాబీ పుత్తర్
ఈసారి ఆక్షన్‌లో భారీ ధర పలికిన రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ కంటే జితేష్ శర్మనే ఎక్కువ ప్యాకేజీ అందుకోనున్నాడు. ఐపీఎల్-2022 వేలంలో శ్రేయస్‌ను రూ.12.25 కోట్ల ధరకు కేకేఆర్ దక్కించుకుంది. తాజా వేలంలో పంజాబ్ అతడ్ని రూ.26.75 కోట్లకు సొంతం చేసుకుంది. అంటే మునుపటి శాలరీ కంటే అతడు మరో రూ.14.50 కోట్లు ఎక్కువ అందుకోనున్నాడు. అంటే సుమారుగా 200 శాతం శాలరీ హైక్ ఇస్తున్నారు. కానీ జితేష్‌కు అలా కాదు.. అతడి శాలరీ హైక్ ఏకంగా 5500 శాతంగా ఉంది. అతడి తర్వాతి స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ ఉన్నాడు. ఈసారి వేలంలో రూ.18 కోట్ల ధర పలికిన ఈ పేసర్ గత ఐపీఎల్ శాలరీ రూ.4 కోట్లు. గత సీజన్‌తో పోలిస్తే మరో రూ.14 కోట్లు ఎక్కువ అందుకోనున్నాడీ పంజాబీ పుత్తర్. అతడికి సుమారుగా 3500 శాతం శాలరీ హైక్ జరిగిందని చెప్పొచ్చు.
Also Read:
రాసి పెట్టుకోండి.. ఆర్సీబీకి అతడే కెప్టెన్: ఏబీ డివిలియర్స్
అరెరె.. కోహ్లీకి ఇలా జరిగిందేంటి.. ఇక్కడ కూడా అతడి డామినేషనేనా..
తీవ్ర విషాదం.. మ్యాచ్ ఆడుతూ కుప్పకూలిన క్రికెటర్..
For More Sports And Telugu News
Updated Date - Nov 29 , 2024 | 04:51 PM