Rishabh Pant: చరిత్ర సృష్టించిన పంత్.. ఇది మామూలు ఫీట్ కాదు
ABN, Publish Date - Nov 02 , 2024 | 11:19 AM
Rishabh Pant: టీమిండియా డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టులో అరుదైన ఘనతను అందుకున్నాడు.
IND vs NZ: టీమిండియా డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. కమ్‌బ్యాక్‌లో చెలరేగిపోతున్న ఈ చిచ్చరపిడుగు మరోమారు బ్యాట్‌తో దుమ్మురేపాడు. ముంబైలోని వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో స్పైడీ విధ్వంసం సృష్టించాడు. భారీ షాట్లతో కివీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు పంత్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి టాప్ బ్యాటర్లకూ సాధ్యం కాని రేర్ ఫీట్‌ను అతడు చేరుకున్నాడు. ఇంతకీ పంత్ నెలకొల్పిన ఆ రికార్డు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
ఎప్పటికీ నిలిచిపోయే ఫీట్
ముంబై టెస్ట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడిన పంత్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా టెస్ట్ క్రికెట్ హిస్టరీలో న్యూజిలాండ్ మీద అత్యంత వేగంగా అర్ధ సెంచరీ నమోదు చేసిన భారతీయ క్రికెటర్‌గా పంత్ చరిత్ర సృష్టించాడు. ఈ లెఫ్టాండ్ బ్యాటర్‌తో పాటు మరో యంగ్‌స్టర్ శుబ్‌మన్ గిల్ (79 బంతుల్లో 59 నాటౌట్) కూడా రాణించడంతో మూడో టెస్టులో భారత్ దూసుకెళ్తోంది. ప్రస్తుతం మెన్ ఇన్ బ్లూ స్కోరు 4 వికెట్లకు 168.
ఇద్దరి మీదే భారం
కివీస్ స్కోరుకు భారత్ ఇంకా 66 పరుగుల దూరంలో ఉంది. పంత్, గిల్ ఎంత ఎక్కువ సేపు క్రీజులో ఉంటారనే దాని మీదే భారీ స్కోరు ఆశలు ఆధారపడి ఉంటాయి. వీళ్లిద్దరిలో కనీసం ఒకరు ఆఖరి వరకు నిలబడితే మంచి ఆధిక్యం సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా పంత్ గనుక ఫిఫ్టీని భారీ సెంచరీగా మారిస్తే ముంబై టెస్ట్‌లో రోహిత్ సేన కచ్చితంగా పైచేయి సాధిస్తుంది. ఆల్రెడీ మెరుపు హాఫ్ సెంచరీతో దూకుడు మీద ఉన్న స్పైడీ ఏం చేస్తాడో చూడాలి.
Also Read:
ఇలా జరుగుతుందని అనుకోలేదు.. అంతా తారుమారు: జడేజా
క్లాసెన్‌కు జాక్‌పాట్
For More Sports And Telugu News
Updated Date - Nov 02 , 2024 | 11:27 AM