ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rohit-Kohli: డేంజర్‌లో రోహిత్-కోహ్లీ.. రిటైర్మెంట్ తప్పించుకోవాలంటే ఒకటే దారి

ABN, Publish Date - Dec 08 , 2024 | 06:28 PM

Rohit-Kohli: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డేంజర్‌లో పడ్డారు. ఒక్క ఓటమి వాళ్ల కెరీర్‌ను ప్రమాదంలో పడేసింది. దీని నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. కానీ ఓ పని చేస్తే మాత్రం రిటైర్మెంట్ సమస్య నుంచి బయటపడొచ్చు.

IND vs AUS: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డేంజర్‌లో పడ్డారు. ఒక్క ఓటమి వాళ్ల కెరీర్‌ను ప్రమాదంలో పడేసింది. దీని నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. అవును, అడిలైడ్ టెస్ట్ ‌ఘోర ఓటమి రోకో జోడీకి తీవ్ర ఇబ్బందికరంగా మారుతోంది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో భారత్ వైట్‌వాష్ అయింది. అప్పుడే వీళ్లిద్దరి పనైపోయింది.. లాంగ్ ఫార్మాట్‌లో నుంచి తీసేయాలని పలువైపుల నుంచి డిమాండ్లు మొదలయ్యాయి. తాజాగా పింక్ బాల్ టెస్ట్ ఓటమితో అవి మరింత ఎక్కువయ్యాయి. అయితే దీని నుంచి బయటపడేందుకు వాళ్లిద్దరికీ ఒక దారి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..


ఇంకో ఆప్షన్ లేదు

రోహిత్-కోహ్లీ ఈ మధ్య కాలంలో టెస్టుల్లో దారుణంగా విఫలమవుతున్నారు. వరుసగా ఫెయిల్ అవుతూ అందర్నీ నిరాశపరుస్తున్నారు. పెర్త్ టెస్ట్‌ సెంచరీని మినహాయిస్తే కోహ్లీ బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్‌లు రాలేదు. అతడు డబుల్ డిజిట్ చేరడమే గగనంగా ఉంది. హిట్‌మ్యాన్‌దీ ఇదే పరిస్థితి. విరాట్ అయినా ఒక సెంచరీ కొట్టాడు.. రోహిత్ దగ్గర నుంచి అదీ లేదు. గత 12 ఇన్నింగ్స్‌ల్లో అతడు ఒకే హాఫ్ సెంచరీ బాదాడు. అదే సమయంలో టీమిండియా టెస్టుల్లో వరుసగా పరాజయాల పాలవుతోంది. దీంతో అతడి కెప్టెన్సీ సామర్థ్యం మీద కూడా నీడలు కమ్ముకున్నాయి. దీంతో రోకో జోడీ రిటైర్మెంట్ తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.


అదొక్కటే మార్గం

ఇప్పటికే టీ20లకు గుడ్‌బై చెప్పేశారు రోహిత్-కోహ్లీ. వన్డేలు, టెస్టుల్లో మాత్రం మరికొంత కాలం కొనసాగాలని అనుకుంటున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, ఛాంపియన్స్ ట్రోఫీపై ఈ మోడర్న్ మాస్టర్స్ కన్నేశారు. అయితే టెస్టుల్లో వరుస వైఫల్యాలతో ఇది కష్టంగా ఉంది. ఒకవేళ ఆ ట్రోఫీల కలను నిజం చేసుకోవాలంటే ఇకపై ఆడే ప్రతి మ్యాచ్‌ను కెరీర్ ఆఖరి మ్యాచ్‌ అనుకొని ఆడాలి. పూర్తి నిబద్ధతతో, పట్టుదలతో బ్యాటింగ్ చేయాలి. ప్రతి ఇన్నింగ్స్‌ను అంతే కీలకంగా భావించాలి. గెలుపు తప్ప ఇంకే పదం వినిపించనంతగా ఆడాలి. వైఫల్యాలు మరిచిపోయి చెలరేగి ఆడాలి. బ్యాట్‌తోనే అందరికీ సమాధానం ఇవ్వాలి. బీజీటీలో టీమిండియాను విజేతగా నిలవాలి. అప్పుడే రోకో జోడీ రిటైర్మెంట్ ఆగడంతో పాటు ఆ రెండు ఐసీసీ కప్పులు గెలవాలనే డ్రీమ్ కూడా నిజమవుతుందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.


Also Read:

ఈ స్క్రాప్ అవసరమా.. తీసిపారేయండి అంటున్న నెటిజన్స్

ఫోన్ నంబర్‌ను తలపిస్తున్న స్కోర్ కార్డ్.. రోహిత్ ఫెయిల్యూర్‌కు బిగ్ ప్రూఫ్

అడిలైడ్‌లో ఘోర ఓటమి.. అతడి కోసం వెయిటింగ్ అంటున్న రోహిత్

కోహ్లీ ఎలాంటివాడో చెప్పిన ఫుట్‌బాల్ స్టార్.. కామెంట్స్ వైరల్

For More Sports And Telugu News

Updated Date - Dec 08 , 2024 | 06:29 PM