Share News

Rohit Sharma & Virat Kohli: సంచలనం.. టీ20 వరల్డ్‌కప్ తర్వాత ఆ ఇద్దరు గుడ్‌బై?

ABN , Publish Date - Jun 27 , 2024 | 05:16 PM

టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ముగిసిన తర్వాత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలకనున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.

Rohit Sharma & Virat Kohli: సంచలనం.. టీ20 వరల్డ్‌కప్ తర్వాత ఆ ఇద్దరు గుడ్‌బై?
Rohit Sharma & Virat Kohli

టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ముగిసిన తర్వాత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలకనున్నారా? గత కొంతకాలం నుంచి ఈ విషయంపై రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి కానీ, పూర్తి క్లారిటీ మాత్రం రావట్లేదు. ఇలాంటి తరుణంలో.. భారత మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ (Wasim Jaffer) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ మెగా టోర్నీ తర్వాత ఆ ఇద్దరు టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని బాంబ్ పేల్చాడు.


తన యూట్యూబ్ ఛానెల్‌లో జాఫర్ మాట్లాడుతూ.. ‘‘టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత ఈ పొట్టి ఫార్మాట్‌కు రోహిత్, కోహ్లీ రిటైర్‌మెంట్ ప్రకటిస్తారని నేను అనుకుంటున్నా. ఇది వారి స్వీయనిర్ణయం కావొచ్చు లేదా సెలెక్టర్లు వారిని తొలగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఐపీఎల్‌లో వాళ్లిద్దరు కొనసాగవచ్చు కానీ.. అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం వారిని చూడటం ఇదే చివరిసారి కావొచ్చు’’ అని చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో.. కోహ్లీ కచ్ఛితంగా వంద అంతర్జాతీయ సెంచరీలు నమోదు చేస్తాడన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. అతనికి ఇంకా చాలా సమయం ఉందని, ఇప్పటికీ ఎంతో ఫిట్‌గా ఉన్నాడని, అతను వంద సెంచరీల మార్క్ అందుకోవాలని ఆశిస్తున్నానని పేర్కొన్నాడు.


ఇదిలావుండగా.. టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత భారత జట్టు జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడబోతోంది. అయితే.. ఈ సిరీస్‌కి సీనియర్ ఆటగాళ్లను దూరం పెట్టారు. రోహిత్, కోహ్లీ, పాండ్యా, సూర్య, జడేజా, బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చారు. రీసెంట్‌గానే.. ఈ సిరీస్‌కు గాను యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టుని బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకి నాయకత్వం వహించే బాధ్యతలను శుభ్‌మన్ గిల్‌కు అప్పగించింది. ఐపీఎల్ మంచి ప్రదర్శన కనబర్చిన రియాన్, అభిషేక్, నితీశ్ రెడ్డిలకు ఈ జట్టులో ఛాన్స్ దక్కింది. అయితే.. గాయం కారణంగా నితీశ్ తప్పుకున్నాడని, అతని స్థానంలో శివమ్ దూబెని ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 27 , 2024 | 05:16 PM