Share News

Shubman Gill: జేబులో కర్చీఫ్‌తో బ్యాటింగ్.. గిల్ ఎందుకిలా చేశాడో తెలుసా..

ABN , Publish Date - Dec 06 , 2024 | 02:06 PM

Shubman Gill: గాయం కారణంగా పెర్త్ టెస్ట్‌కు దూరమైన శుబ్‌మన్ గిల్.. అడిలైడ్ టెస్ట్‌లో బరిలోకి దిగాడు. అయితే బ్యాటింగ్ సమయంలో జేబులో ఎర్ర కర్చీఫ్ వేసుకొని కనిపించాడు. దీంతో అసలు ఈ కర్చీఫ్ కహానీ ఏంటని అభిమానులు తెలుసుకునే పనిలో పడ్డారు.

Shubman Gill: జేబులో కర్చీఫ్‌తో బ్యాటింగ్.. గిల్ ఎందుకిలా చేశాడో తెలుసా..

IND vs AUS: గాయం కారణంగా పెర్త్ టెస్ట్‌కు దూరమయ్యాడు టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్. అయితే తక్కువ సమయంలోనే కోలుకున్న అతడు.. ప్రెమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో మ్యాచ్‌లో పాల్గొన్నాడు. హాఫ్ సెంచరీ బాది ఫామ్, ఫిట్‌నెస్ రెండూ నిరూపించుకున్నాడు. దీంతో అడిలైడ్ టెస్ట్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. దేవ్‌దత్ పడిక్కల్ ప్లేస్‌లో బరిలోకి దిగిన గిల్.. ఊహించిన రేంజ్‌లో కాకపోయినా ఫర్వాలేదనిపించాడు. అయితే బ్యాటింగ్ సమయంలో జేబులో ఎర్ర కర్చీఫ్ వేసుకొని కనిపించాడు. దీంతో అసలు ఈ కర్చీఫ్ కహానీ ఏంటి? గిల్ ఎందుకు ఎర్ర దస్తీ వాడుతున్నాడు? అనేది తెలుసుకునే పనిలో పడ్డారు అభిమానులు. మరి.. రెడ్ కర్చీఫ్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..


కలిసొచ్చిన కర్చీఫ్

పింక్ బాల్ టెస్ట్‌‌లో గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడి ప్యాంట్ జేబులో ఎర్ర కర్చీఫ్ కనిపించింది. కెమెరా కంటికి చిక్కిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అసలు ఎందుకీ దస్తీ వాడుతున్నాడు? దీని వెనుక సీక్రెట్ ఏంటని ఆలోచనల్లో పడ్డారు ఫ్యాన్స్. అయితే ఈ కర్చీఫ్‌ వెనుక ఓ సెంటిమెంట్ ఉంది. కెరీర్ మొదట్లో అండర్-16 లెవల్‌లో ఆడుతున్నప్పుడు గిల్ వరుస మ్యాచుల్లో ఫెయిల్ అయ్యాడు. అయితే ఓ మ్యాచ్‌కు అనుకోకుండా తన జేబులో తెల్ల రంగు దస్తీ వేసుకొని వెళ్లాడు. అది అతడికి బాగా కలిసొచ్చింది. లో స్కోర్ల నుంచి బయటపడి భారీ సెంచరీ బాదాడు గిల్. దీంతో తర్వాతి మ్యాచులకు అతడు తనకు నచ్చిన ఎరుపు రంగులో ఉన్న కర్చీఫ్‌తో బ్యాటింగ్‌కు దిగాడు. అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ వస్తున్నాడు.


సెంటిమెంట్ కంటిన్యూ..

ఎరుపు రంగు కర్చీఫ్ వేసుకొని ఆడిన తొలి మ్యాచ్‌లోనే గిల్ శతకం బాదాడు. అలా దస్తీ వేసుకోవడం అలవాటు అయ్యాక అతడి బ్యాట్ నుంచి వరుసగా బిగ్ నాక్స్ రాసాగాయి. అలాగే పరుగుల వరద పారిస్తూ పోయాడు. దీంతో కర్చీఫ్ వేసుకోవడం అనేది అతడికి రివాజుగా మారింది. అప్పటి నుంచి బ్యాటింగ్ సమయంలో జేబులో కర్చీఫ్ లేనిది అతడు క్రీజులోకి దిగడు. ఇదే సెంటిమెంట్‌ను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ అతడు కంటిన్యూ చేశాడు. అయితే కెమెరాల కంటికి చిక్కడంతో కర్చీఫ్ సెంటిమెంట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కాగా, అడిలైడ్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 51 బంతుల్లో 31 పరుగులు చేసి ఔట్ అయ్యాడు గిల్. మంచి స్టార్ట్ దొరికినా భారీ స్కోరుగా మలచలేకపోయాడు. ప్రస్తుతం టీమిండియా 8 వికెట్లకు 176 పరుగులతో ఉంది.


Also Read:

ప్రతీకారం తీర్చుకున్న స్టార్క్.. చెప్పి మరీ కొట్టాడుగా..

కేఎల్ రాహుల్ చేసిన పనికి.. క్షణాల్లో ఆవిరైన ఆస్ట్రేలియా ఆనందం.. వీడియో

భారీ ఎదురుదెబ్బ.. కీలక వికెట్ సమర్పించుకున్న టీమిండియా

హైబ్రిడ్‌ మోడల్‌లో చాంపియన్స్‌ ట్రోఫీ?

For More Sports And Telugu News

Updated Date - Dec 06 , 2024 | 02:17 PM