IPL 2024: ఎగిరి గంతేసిన కావ్య.. కానీ నిమిషాల్లోనే మాడిపోయిన మొహం.. అసలు ఏం జరిగిందంటే..
ABN, Publish Date - Mar 24 , 2024 | 08:09 PM
కావ్య మారన్. క్రికెట్ ప్రేమికులకు ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని అయిన కావ్య తన జట్టును ఎప్పుడూ సపోర్టు చేస్తుంటుంది. నిజానికి ఇందులో ప్రత్యేకత ఏం లేదు.
కోల్‌కతా: కావ్య మారన్. క్రికెట్ ప్రేమికులకు ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని అయిన కావ్య తన జట్టును ఎప్పుడూ సపోర్టు చేస్తుంటుంది. నిజానికి ఇందులో ప్రత్యేకత ఏం లేదు. ఎందుకంటే ఏ యజమాని అయినా తమ జట్టును సపోర్టు చేస్తారు కాబట్టి.. కానీ కావ్య అందరిలా కాదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే ప్రతి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడడానికి మైదానానికి వెళ్తుంది. మైదానంలో తమ జట్టు ఆడుతుంటే గ్యాలరీల్లో కూర్చొని జట్టుకు మద్దతిస్తుంటుంది. తమ ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తుంది. తమ ఆటగాళ్లు బాగా ఆడినా, జట్టు గెలిచినా ఆనందంతో ఆమె మోహం వెలిగిపోతుంది. తమ ఆటగాళ్లు విఫలమైనప్పుడు, జట్టు ఓడినప్పుడు కావ్య మారన్ మోహం మాడ్చుకుని కూర్చుంటుంది. మ్యాచ్ జరిగే సమయంలో కెమెరామెన్‌లు కూడా కావ్యపై ప్రత్యేక దృష్టి పెడుతుంటారు. నిత్యం ఆమె హవా భావాలను తమ కెమెరాల్లో రికార్డు చేస్తారు. దీంతో మ్యాచ్ మధ్యలో కావ్య తరచుగా కనిపిస్తుంటుంది. కావ్య స్క్రీన్‌పై కనిపిస్తే చాలు అభిమానులు కూడా కేరింతలతో అల్లరి చేస్తుంటారు.
తాజాగా మొదలైన ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ తొలి మ్యాచ్‌ను శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడింది. అయితే ఈ మ్యాచ్ చివరి ఓవర్‌లో కావ్య హవాభావాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. అసలు ఏం జరిగిందంటే.. సన్‌రైజర్స్ విజయానికి చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరం అయ్యాయి. ఇలాంటి సమయంలో అప్పటికే హాఫ్ సెంచరీతో చెలరేగుతున్న క్లాసెన్.. హర్షిత్ రానా వేసిన మొదటి బంతినే సిక్సు బాదాడు. దీంతో కావ్య ఆనందంతో ఎగిరి గంతేసింది. ఆ తర్వాత 5 బంతుల్లో చేయాల్సింది 7 పరుగులే కావడంతో ఆనందంలో మునిగితేలింది. ధాటిగా ఆడుతున్న క్లాసెన్, షాబాజ్ అహ్మద్ క్రీజులో ఉండడంతో అందరూ హైదరాబాద్‌దే విజయం అనుకున్నారు. కానీ ఆ తర్వాతి బంతికి క్లాసెన్ సింగిల్ తీయగా.. మూడో బంతికి షాబాజ్ అహ్మద్ ఔటయ్యాడు. నాలుగో బంతికి మార్కో జాన్సెన్ సింగిల్ తీశాడు. ఐదో బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి క్లాసెన్ కూడా ఔటయ్యాడు. సుశాంత్ శర్మ క్యాచ్ అద్భుతంగా అందుకున్నాడు. దీంతో 5 బంతుల్లో 7 పరుగులుగా ఉన్న సమీకరణం ఒకసారిగా ఒక బంతిలో 5 పరుగులుగా మారిపోయింది. చివరి బంతికి పరుగులేమి రాలేదు. దీంతో అనూహ్యంగా సన్‌రైజర్స్ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది.
దీంతో కావ్య మోహం ఓటమి బాధతో మాడిపోయింది. క్లాసెన్ ఔటైన వెంటనే ఆమె మోహంలో నిరాశ, నిస్పృహ స్పష్టంగా కనిపించాయి. ఆనందంతో గంతేసిన నిమిషాల వ్యవధిలోనే ఆమె తీవ్రంగా బాధపడడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అందుకే తొందరపడి ముందుగానే సంబరాలు చేసుకోకూడదని పలువురు నెటిజన్లు కావ్యకు సూచిస్తున్నారు. కాగా తమిళ్ సూపర్ స్టార్ రజనీ కాంత్ సైతం గతంలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సన్‌రైజర్స్ ఓటమి సమయంలో బాధతో కూడిన కావ్య మోహాన్ని చూడలేకపోతున్నానని వ్యాఖ్యానించాడు. దీంతో ఆమె వచ్చే సీజన్‌లోనైనా మంచి జట్టును తీసుకోవాలని ఆశించాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. హోరాహోరీగా సాగిన ఈ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో కేకేఆర్‌ను విజయం వరించింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ అభిమానులను అలరించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 208/7 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆండ్రూ రస్సెల్(64), ఫిలిప్ సాల్ట్(54) చెలరేగారు. అనంతరం సన్‌రైజర్స్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. ఒకానొక దశలో గెలుస్తుందేమో అనిపించింది. కానీ చివరికి 204/7 వద్ద నిలిచిపోయింది. గెలుపుపై ఆశలు వదులుకున్న సమయంలో హెన్రిచ్ క్లాసెన్(63) అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.
ఇలాంటి మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
RR vs LSG: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. వరుసగా ఐదు సీజన్లలో..
RR vs LSG: వాట్ ఏ క్యాచ్ రాహుల్.. గాయం తర్వాత కూడా సూపర్ కీపింగ్
Updated Date - Mar 24 , 2024 | 08:09 PM