SRH vs KKR: టాస్ గెలిచిన హైదరాబాద్.. తుది జట్టు ఇదే!
ABN, Publish Date - Mar 23 , 2024 | 07:07 PM
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. ఈ సీజన్‌లో రెండు జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి.
కోల్‌కతా: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. ఈ సీజన్‌లో రెండు జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరించనున్నారు. గత సీజన్‌లో పాయింట్ల పట్టికలో కేకేఆర్ 7వ స్థానంలో నిలవగా.. సన్‌రైజర్స్ చిట్టచివరన 10వ స్థానంలో నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లు ఇప్పటివరకు 25 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. అత్యధికంగా కోల్‌కతా 16 మ్యాచ్‌ల్లో గెలవగా, హైదరాబాద్ 9 మ్యాచ్‌ల్లో గెలిచింది.
తుది జట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్:
ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకు సింగ్, రమణదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
సన్‌రైజర్స్ హైదరాబాద్:
మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మాక్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి. నటరాజన్
Updated Date - Mar 23 , 2024 | 07:22 PM