IPL 2024: సరికొత్త రికార్డు నెలకొల్పిన సన్‌రైజర్స్ బౌలర్.. మనీష్ పాండేను అధిగమించి..
ABN , Publish Date - Mar 28 , 2024 | 12:01 PM
ఐపీఎల్‌లో (IPL 2024) చాలా తక్కువ మంది ఆటగాళ్లు మాత్రమే తమ కెరీర్ మొత్తంలో ఒకటి రెండు జట్లకే ప్రాతినిధ్యం వహిస్తారు. ఎక్కువ మంది ఆటగాళ్లు అనేక జట్లకు ప్రాతినిధ్యం వహిస్తుంటారు. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ (Jaydev Unadkat) సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
హైదరాబాద్: ఐపీఎల్‌లో (IPL 2024) చాలా తక్కువ మంది ఆటగాళ్లు మాత్రమే తమ కెరీర్ మొత్తంలో ఒకటి రెండు జట్లకే ప్రాతినిధ్యం వహిస్తారు. ఎక్కువ మంది ఆటగాళ్లు అనేక జట్లకు ప్రాతినిధ్యం వహిస్తుంటారు. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ (Jaydev Unadkat) సరికొత్త రికార్డు నెలకొల్పాడు. బుధవారం ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad vs Mumbai Indians) ఆడిన మ్యాచ్‌లో ఉనద్కత్ బరిలోకి దిగాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక జట్లకు ఆడిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో 7 జట్లకు ఆడిన మనీష్ పాండే(Manish Pandey) రికార్డును అధిగమించాడు. ఈ సీజన్‌లో జయదేవ్ ఉనద్కత్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఉనద్కత్ ప్రాతినిధ్యం వహిస్తోన్న 8వ జట్టు సన్‌రైజర్స్. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక జట్లకు ప్రాతినిధ్యం వహించిన భారత ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఫించ్ 9 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
కాగా తన ఐపీఎల్ కెరీర్‌లో ఉనద్కత్ కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, లక్నోసూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఆరోన్ ఫించ్ విషయానికొస్తే రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, పుణే వారియస్స్ ఇండియా, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ముంబైపై సన్‌రైజర్స్ జట్టు 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 277/3 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ జట్టు బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(62), అభిషేక్ శర్మ(63), క్లాసెన్(80) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అనంతరం లక్ష్య చేధనలో ముంబై జట్టు మొదటి 10 ఓవర్లలో చేసిన బ్యాటింగ్ చేస్తే ఒకానొక దశలో వారే గెలుస్తారేమో అనిపించింది. కానీ డెత్ ఓవర్లలో హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 246/5 వద్ద పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(64), టిమ్ డేవిడ్(42), ఇషాన్ కిషన్(34) చెలరేగారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
SRH vs MI: ముంబై బౌలర్లను ఉతికారేసిన తండ్రి.. ఈ చిట్టి తల్లి ఎంకరేజ్‌మెంట్‌కు అంతా ఫిదా!
SRH vs MI: 20 కోట్లు అవసరమా అన్నారు.. కట్ చేస్తే అతనే మ్యాచ్ గెలిపించాడు..