IND vs ENG: ధోని తర్వాత అతనే అత్యుత్తమ కెప్టెన్.. రోహిత్ శర్మపై సురేష్ రైనా ప్రశంసలు
ABN, Publish Date - Feb 28 , 2024 | 05:15 PM
రోహిత్ శర్మ కెప్టెన్సీ అద్భుతంగా ఉందని, ధోని తర్వాత అతనే అత్యుత్తమ కెప్టెన్ అని టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ప్రశంసలు కురిపించాడు. ధోని మాదిరిగా రోహిత్ శర్మ కూడా యువ ఆటగాళ్లకు చాలా అవకాశాలు ఇస్తున్నాడని కొనియాడాడు.
రోహిత్ శర్మ కెప్టెన్సీ అద్భుతంగా ఉందని, ధోని తర్వాత అతనే అత్యుత్తమ కెప్టెన్ అని టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ప్రశంసలు కురిపించాడు. ధోని మాదిరిగా రోహిత్ శర్మ కూడా యువ ఆటగాళ్లకు చాలా అవకాశాలు ఇస్తున్నాడని కొనియాడాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో గెలుచుకుంది. విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ వంటి ఆటగాళ్లు సిరీస్ మొత్తానికే దూరం కాగా.. రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వంటి కీలక ఆటగాళ్లు పలు మ్యాచ్‌లకు అందుబాటులో లేరు. అయినప్పటికీ యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టుతో రోహిత్ శర్మ అద్భుతం చేశాడు. బజ్ బాల్ వ్యూహంతో చెలరేగుతున్న ఇంగ్లీష్ జట్టును మట్టికరిపించాడు. ఈ సిరీస్‌లో ఏకంగా నలుగురు యువ ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. ఇచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్న కుర్రాళ్లు టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించారు. కుర్రాళ్లతో కూడిన జట్టును రోహిత్ శర్మ నడిపిన తీరుపై అంతటా ప్రశంసలు కురుస్తున్నాయి. హిట్‌మ్యాన్ కెప్టెన్సీని అందరూ కొనియాడుతున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీపై ప్రశంసలు కురిపించాడు.
‘‘మహేంద్ర సింగ్ ధోని తర్వాత రోహిత్ శర్మనే ఉత్తమ కెప్టెన్. హిట్‌మ్యాన్ కెప్టెన్సీ బాగుంది. ధోని మాదిరిగా రోహిత్ శర్మ కూడా యువ ఆటగాళ్లకు చాలా అవకాశాలు ఇస్తున్నాడు. నేను ధోని సారథ్యంలో చాలా క్రికెట్ ఆడాను. సౌరవ్ గంగూలీ కూడా కుర్రాళ్లకు స్వేచ్ఛ ఇచ్చేవాడు. గంగూలీ తర్వాత ధోని జట్టును ముందుండి నడిపించాడు. ప్రస్తుత రోహిత్ శర్మ జట్టును సరైన దిశలో నడిపిస్తున్నాడు. అతను తెలివైన కెప్టెన్. గత కొన్నేళ్లుగా ఆటగాళ్లను ఇలా రోటేట్ చేసిన పద్దతిని నేను ఎప్పుడూ చూడలేదు. గత కొన్నేళ్లలో ఫాస్ట్ బౌలర్లు తరచుగా గాయాలబారిన పడడం మనం తరచుగా చూస్తున్నాం. కానీ రోహిత్ శర్మ దానిని బాగా మ్యానేజ్ చేస్తున్నాడు. ఇంతకుముందు ఇండియాలో ఆడినప్పుడు మాకు ఒక ఫాస్ట్ బౌలర్, ముగ్గురు లేదా నలుగురు స్పిన్నర్లు ఉండేవారు. కానీ ప్రస్తుతం రోహిత్ శర్మ ఇద్దరు పేసర్లను తీసుకుంటున్నాడు. సిరాజ్, బుమ్రాలను ఆడిస్తున్నాడు. గత మ్యాచ్‌లో బుమ్రాకు విశ్రాంతినిచ్చి ఆకాష్ దీప్‌తో అరంగేట్రం చేయించాడు. తద్వారా బుమ్రాపై పనిభారం పడకుండా బాగా హ్యాండిల్ చేశాడు.’’ అని సురేష్ రైనా అన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 28 , 2024 | 05:15 PM