Virat Kohli: జూనియర్ పాంటింగ్‌తో ఫైట్.. కోహ్లీకి షాక్ ఇచ్చిన ఐసీసీ
ABN, Publish Date - Dec 26 , 2024 | 02:39 PM
Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది. జూనియర్ పాంటింగ్‌తో గొడవకు దిగినందుకు కింగ్‌కు కోలుకోలేని విధంగా ఎదురుదెబ్బ పడింది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
IND vs AUS: టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టైమ్ అస్సలు బాగోలేదు. అతడు ఏం చేసినా కాంట్రవర్సీ అయిపోతోంది. ముందే ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఈ స్టార్ బ్యాటర్.. అనవసరమైన దూకుడుతో కొత్త సమస్యలు తెచ్చుకుంటున్నాడు. చాన్నాళ్లుగా టెస్టుల్లో విఫలమవుతూ వస్తున్న కింగ్.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనూ అదే కంటిన్యూ చేస్తున్నాడు. పెర్త్ టెస్ట్‌లో సెంచరీ మినహా ఈ సిరీస్‌లో అతడి బ్యాట్ గర్జించిందే లేదు. ఇలాంటి తరుణంలో ఓ వివాదంలో చిక్కుకున్నాడు కోహ్లీ. దీంతో అతడికి ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది. ఏకంగా మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది. అసలు ఏం జరిగింది? కోహ్లీకి ఐసీసీ షాక్ ఇవ్వడం వెనుక కారణాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
అనవసరంగా గెలికాడు
బాక్సింగ్ డే టెస్ట్‌లో తొలి రోజు ఆస్ట్రేలియా బాగా ఆడింది. తొలి రోజు ఆట ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. కొత్త కుర్రాడు సామ్ కోన్స్టాస్ (60), ఉస్మాన్ ఖవాజా (57)తో పాటు మార్నస్ లబుషేన్ (72), స్టీవ్ స్మిత్ (68 నాటౌట్) క్వాలిటీ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. అయితే అరంగేట్ర బ్యాటర్ కోన్స్టాస్‌తో విరాట్ కోహ్లీ గొడవకు దిగడం మొదటి రోజు ఆటలో చర్చనీయాంశంగా మారింది. వరుస ఫోర్లు, సిక్సులతో జస్‌ప్రీత్ బుమ్రా సహా భారత బౌలర్లు అందర్నీ భయపెడుతున్న కోన్స్టాస్‌ను కోహ్లీ గెలికాడు. గ్లవ్స్ సరిచేసుకుంటున్న అతడ్ని ఢీకొట్టాడు విరాట్. ఆ తర్వాత ఇద్దరూ ఒక్నొకరు ఏదో కామెంట్ చేసుకుంటూ కనిపించారు.
ఐసీసీ మాస్టర్‌స్ట్రోక్
కోన్స్టాస్ తప్పు లేకపోయినా కోహ్లీ అతడ్ని ఢీకొట్టడం హాట్ టాపిక్‌గా మారింది. అగ్రెషన్ చూపించడంలో భాగంగా కోహ్లీ ఇలా చేయడం, ఆసీస్‌ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం టాక్టిక్ అనే చెప్పాలి. అయితే దీనిపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సీరియస్ అయింది. కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది. మొదటి రోజు ఆట ముగిసిన తర్వాత మ్యాచ్ రిఫరీ ఎదుట హాజరైన కోహ్లీ తన తప్పు ఒప్పుకోవడంతో అతడికి 20 శాతం జరిమానా, 1 డీమెరిట్ పాయింట్ వేశారు. అసలే ఫామ్ కోల్పోయి కష్టాల్లో ఉన్న కోహ్లీకి, అటు భారత జట్టుకు ఇది భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి.
Also Read:
తగలరాని చోట తగిలిన బంతి.. స్మిత్ రియాక్షన్ వైరల్
సస్పెన్షన్ సమయంలో టోర్నీలు ఎలా ఆడింది?
మనూ భాకర్‌కు ఖేల్‌రత్న?
నమన్ ఓఝా తండ్రికి జైలు
For More Sports And Telugu News
Updated Date - Dec 26 , 2024 | 02:43 PM