ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Virat Kohli: చరిత్రకు అడుగు దూరంలో కోహ్లీ.. ఏకైక బ్యాటర్‌గా రికార్డు

ABN, Publish Date - Dec 05 , 2024 | 08:14 PM

Virat Kohli: పింక్ బాల్ టెస్ట్‌ కోసం విరాట్ కోహ్లీ సన్నద్ధమవుతున్నాడు. మొదటి మ్యాచ్‌లోలాగే మరోమారు తన బ్యాట్ తడాఖా చూపించేందుకు అతడు రెడీ అవుతున్నాడు. కంగారూ బౌలర్ల బెండు తీసేందుకు అస్త్రాలను సిద్ధం చేస్తున్నాడు.

IND vs AUS: పింక్ బాల్ టెస్ట్‌ కోసం విరాట్ కోహ్లీ సన్నద్ధమవుతున్నాడు. మొదటి మ్యాచ్‌లోలాగే మరోమారు తన బ్యాట్ తడాఖా చూపించేందుకు టీమిండియా టాప్ బ్యాటర్ రెడీ అవుతున్నాడు. కంగారూ బౌలర్ల బెండు తీసేందుకు అస్త్రాలను సిద్ధం చేస్తున్నాడు. సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులన్ని తన ఖాతాలో వేసుకున్న కింగ్.. మరో అరుదైన ఘనతపై కన్నేశాడు. సెకండ్ టెస్ట్‌లో రెండు క్రేజీ రికార్డుల్ని బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. అందులో ఒకటి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ది కావడం విశేషం.. మరి ఆ రెండు రికార్డులు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..


సచిన్‌ను దాటుతాడా?

పింక్ బాల్ టెస్ట్‌కు ముందు రెండు అరుదైన రికార్డులు కోహ్లీని ఊరిస్తున్నాయి. అడిలైడ్ టెస్ట్‌లో విరాట్ మరో సెంచరీ గనుక సాధిస్తే సచిన్‌ను అధిగమిస్తాడు. బోర్డర్-గవాస్కర్ హిస్టరీలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా మాస్టర్ బ్లాస్టర్ ఉన్నాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గనుక మూడంకెల స్కోరును చేరుకుంటే సచిన్‌ను దాటేస్తాడు కోహ్లీ. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ సిరీస్‌లో అత్యధిక సెంచరీల లిస్ట్‌లో టెండూల్కర్‌ (9) తో కలసి విరాట్ సంయుక్తంగా ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్నాడు. బ్యాటింగ్ గ్రేట్‌ను అధిగమించేందుకు విరాట్‌కు ఇది మంచి అవకాశం అనే చెప్పాలి.


మరో రికార్డుకు ఎసరు!

ఆల్రెడీ పెర్త్ టెస్ట్‌లో కోహ్లీ సెంచరీ బాదిన ఊపులో ఉన్నాడు కాబట్టి అదే జోరును పింక్ బాల్ టెస్ట్‌లోనూ కొనసాగిస్తే సచిన్ రికార్డుకు ఎసరు పడినట్లే అని చెప్పొచ్చు. ఇక, విరాట్ ముందు ఉన్న మరో రికార్డు అడిలైడ్ సెంచరీలు. ఈ వేదికలో ఇప్పటివరకు కింగ్ మూడు టెస్ట్ సెంచరీలు సాధించాడు. ఇప్పుడు మరో శతకం బాదితే గనుక ఆసీస్ గడ్డ మీద ఒకే వేదికలో అత్యధిక సెంచరీలు కొట్టిన పర్యాటక బ్యాటర్‌గా అతడు కీర్తి గడిస్తాడు. ఎంతో ఊరిస్తున్న ఈ రెండు రికార్డుల్ని విరాట్ అందుకుంటాడా? లేదా? అనేది చూడాలి.


Also Read:

కావాలనే టార్గెట్ చేస్తున్నారు.. ఏం చేయాలో తెలుసు: కమిన్స్

బ్రాండ్ వాల్యూలో ఆ ఐపీఎల్‌ టీమే టాప్.. సన్‌రైజర్స్ తగ్గేదేలే

ఇష్టం లేకపోయినా టీమ్ కోసమే ఆ పని చేస్తున్నా: రోహిత్ శర్మ

భువనేశ్వర్ సెన్సేషనల్ స్పెల్.. సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఎమోషనల్

For More Sports And Telugu News

Updated Date - Dec 05 , 2024 | 08:21 PM