ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Virat Kohli: ఆస్ట్రేలియాకు కోహ్లీ వార్నింగ్.. రా చూస్కుందామంటూ..

ABN, Publish Date - Dec 07 , 2024 | 01:53 PM

Virat Kohli: ఆస్ట్రేలియా పేరు చెబితే చాలు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి పూనకాలు వచ్చేస్తాయి. ఆ జట్టుతో మ్యాచ్ ఉంటే తనలోని అగ్రెషన్‌ను బయటకు తీసుకొస్తాడు కింగ్. మళ్లీ అదే జరిగింది. కంగారూలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

IND vs AUS: ఆస్ట్రేలియా పేరు చెబితే చాలు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి పూనకాలు వచ్చేస్తాయి. ఆ జట్టుతో మ్యాచ్ ఉంటే తనలోని అగ్రెషన్‌ను బయటకు తీసుకొస్తాడు కింగ్. కెరీర్ మొదట్నుంచి ఇదే తంతు. ఆసీస్‌తో సిరీస్ అంటే చాలు.. కోహ్లీ అటు బ్యాట్‌తో అదరగొడుతూనే, అవసరమైనప్పుడు తన నోరుతోనూ కంగారూలను బెదరగొడుతుంటారు. ప్రత్యర్థి జట్టును మానసికంగా దెబ్బతీసే ఉద్దేశంతో ఇలా చేస్తుంటాడు విరాట్. అందుకే అతడితో పెట్టుకునేందుకు ఆ టీమ్ ప్లేయర్లు భయపడుతుంటారు. అలాంటి ఆసీస్‌కు మరోమారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు కోహ్లీ. నోరు మూస్కోండి అంటూ వేళ్లతో సిగ్నల్ ఇచ్చాడు.. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..


జైస్వాల్ క్యాచ్‌తో..

అడిలైడ్ టెస్ట్‌ రెండో రోజు విరాట్ కోహ్లీ మరింత అగ్రెసివ్‌గా కనిపించాడు. ముఖ్యంగా ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ (126 బంతుల్లో 64) బ్యాటింగ్ చేస్తున్న టైమ్‌లో సీరియస్‌‌గా ఉన్నాడు. లబుషేన్ ఎంతకీ ఔట్ కాకపోవడం, కొన్ని ఛాన్సులు వచ్చినా అదృష్టం అతడికి కలసివచ్చి తప్పించుకోవడంతో భారత ఆటగాళ్లు అసహనానికి గురయ్యారు. కోహ్లీలో కూడా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. ఈ తరుణంలో బౌలింగ్‌కు దిగాడు తెలుగుతేజం నితీష్ కుమార్ రెడ్డి. ఓ షార్ట్ లెంగ్త్ డెలివరీతో లబుషేన్‌ను బోల్తా కొట్టించాడు. అతడి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని వెళ్తున్న బంతిని స్లిప్స్‌లో ఉన్న యశస్వి జైస్వాల్ అద్భుతంగా అందుకున్నాడు. అంతే కోహ్లీ సంబురాల్లో మునిగిపోయాడు.


నోరు మూస్కో..

నిన్నటి నుంచి జిడ్డులా ఇబ్బంది పెడుతున్న లబుషేన్ పెవిలియన్ చేరడంతో కోహ్లీ సంతోషానికి హద్దే లేకుండా పోయింది. ప్లేయర్లు అందరితో కలసి అతడు సెలబ్రేట్ చేసుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తున్న లబుషేన్‌కు కోహ్లీ వార్నింగ్ ఇచ్చాడు. నోరు మూస్కో అంటూ హెచ్చరించాడు. మాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని బెదిరించాడు. రా.. చూస్కుందాం అంటూ అగ్రెషన్ చూపించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్.. కోహ్లీ అగ్రెషన్ అదిరిందని అంటున్నారు. అతడు బ్యాటింగ్‌లోనూ ఇదే జోరు చూపిస్తే మ్యాచ్ మనదేనని కామెంట్స్ చేస్తున్నారు.


Also Read:

బుద్ధి చూపించిన ఆస్ట్రేలియా.. చీటింగ్ రిపీట్

ఆసీస్ బ్యాటర్లను ఆడుకున్న కోహ్లీ.. ఇదీ స్లెడ్జింగ్ అంటే..

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు సుమిత్‌

పారా క్రీడల్లో తెలుగోళ్లకు 7 పతకాలు

For More Sports And Telugu News

Updated Date - Dec 07 , 2024 | 01:57 PM