ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Virat Kohli: కావాలనే సచిన్ కాళ్లు మొక్కించారు.. కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ABN, Publish Date - Nov 07 , 2024 | 09:17 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లో ఎలా ఉంటాడో బయట కూడా అంతే జోవియల్‌గా ఉంటాడు. సీనియర్లు, జూనియర్లు అనే తేడాల్లేకుండా అందరితో కలసిపోతాడు. ప్రెస్ మీట్స్‌తో పాటు అభిమానులను కలసినప్పుడు కూడా సరదాగా మాట్లాడుతూ తన చుట్టూ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేస్తాడు.

Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లో ఎలా ఉంటాడో బయట కూడా అంతే జోవియల్‌గా ఉంటాడు. సీనియర్లు, జూనియర్లు అనే తేడాల్లేకుండా అందరితో కలసిపోతాడు. ప్రెస్ మీట్స్‌తో పాటు అభిమానులను కలసినప్పుడు కూడా సరదాగా మాట్లాడుతూ తన చుట్టూ వాతావరణాన్ని ఆహ్వాదకరంగా మార్చేస్తాడు. ఎవరితో ఎంత వరకు మెలగాలో అంతే ఉంటాడు. ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వని కోహ్లీ ఒకసారి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కాళ్లు మొక్కాల్సి వచ్చిందట. కొందరు సీనియర్ల వల్ల తాను ఈ పని చేయాల్సి వచ్చిందని స్వయంగా విరాటే ఈ విషయాన్ని రివీల్ చేశాడు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..


కోహ్లీ పనికి సచిన్ షాక్

కోహ్లీ టీమ్‌లోకి వచ్చిన కొత్తలో జట్టులోని ఇతర సభ్యులతో కలవాలంటే కాస్త భయపడేవాడట. సచిన్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా లాంటి దిగ్గజ ప్లేయర్లతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం అంటే ఆషామాహీ కాదు. అందుకే విరాట్‌కు కొత్తలో ఏం చేయాలో అసలు పాలుపోయేది కాదట. దీంతో యువీ, భజ్జీ, మునాఫ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్ లాంటి సీనియర్లు ఏం చెబితే అది చేసుకుపోయేవాడట. అయితే ఓ రోజు సచిన్ కాళ్లు మొక్కాలని విరాట్‌ను ఆదేశించారట యువీ అండ్ కో. టీమ్‌లో సీనియర్ అయిన సచిన్‌ను కలసి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ అని.. జూనియర్ కాబట్టి ఆ పని చేయాలని సరదాగా అన్నారట.


నవ్వులే నవ్వులు

యువీ అండ్ కో చెప్పింది నిజమని నమ్మేసిన కోహ్లీ.. సచిన్ దగ్గరకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశాడట. అయితే విరాట్ తన కాళ్ల మీద పడటం చూసి అవాక్కైన మాస్టర్ బ్లాస్టర్, ఎందుకిలా చేస్తున్నావని ఎదురు ప్రశ్నించాడట. దీంతో యువీ అండ్ బ్యాచ్ తనను ఆటపట్టించేందుకు ఈ పని చేయమని అన్నారని తెలుసుకున్నాడట కోహ్లీ. తాజాగా ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొన్న కోహ్లీ.. అప్పటి ఘటనను గుర్తు చేసుకొని నవ్వుల్లో మునిగిపోయాడు. కార్యక్రమంలోని అభిమానులు అతడి మాటలు విని తెగ నవ్వసాగారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also Read:

కొత్త టీమ్‌తో కోహ్లీ.. ఇకపై అంతా వాళ్ల చేతుల్లోకి..

అయ్యర్ ఈజ్ బ్యాక్.. టీమిండియాలోకి రీఎంట్రీ

ఆసీస్‌కు పోయించిన జురెల్.. సోల్జర్ కొడుకు కదా ఆ మాత్రం ఉంటది

For More Sports And Telugu News

Updated Date - Nov 07 , 2024 | 09:34 PM