ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IND vs AUS: ఆసీస్‌కు కొత్త మొగుడు.. కోహ్లీని మించిపోయాడుగా..

ABN, Publish Date - Nov 23 , 2024 | 05:07 PM

IND vs AUS: ఆస్ట్రేలియాకు కొత్త మొగుడు తయారయ్యాడు. ఇన్నాళ్లూ విరాట్ కోహ్లీతోనే కంగారూలకు తంటా అనుకుంటే ఇప్పుడు మరో భారత ప్లేయర్ వారికి తలనొప్పిగా మారాడు.

Yashasvi Jaiswal: టాప్ టీమ్స్‌ను కూడా భయపెట్టడం అంటే ఆస్ట్రేలియాకే సాధ్యం. బ్యాటింగ్, బౌలింగ్‌లోనే కాదు.. మాటల్లోనూ దూకుడు చూపిస్తూ ప్రత్యర్థులను వణికించడం కంగారూలకు అలవాటుగా మారింది. ఎన్నో ఏళ్లుగా స్లెడ్జింగ్ ఆయుధాన్ని ప్రయోగిస్తూ వస్తోందా టీమ్. అయితే టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ముందు ఆసీస్ పప్పులు ఉడకం లేదు. అదే స్లెడ్జింగ్ వెపన్‌ను వాళ్ల మీద రివర్స్ చేశాడు కోహ్లీ. బ్యాటింగ్‌లో పరుగుల వరద పారిస్తూనే.. ఎప్పటికప్పుడు మాటల తూటాలతో వాళ్లను రెచ్చగొట్టి కంగారూల వెన్నులో వణుకు పుట్టించాడు. అందుకే భారత్‌తో మ్యాచ్ అంటే ఆ జట్టు భయపడుతోంది. అయితే ఇప్పుడు విరాట్ వారసుడు వచ్చేశాడు.


స్టార్క్‌తో ఆటాడుకున్నాడు

ఆస్ట్రేలియాకు కొత్త మొగుడు తయారయ్యాడు. అతడే యశస్వి జైస్వాల్. పెర్త్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో చెలరేగిన యంగ్ ఓపెనర్.. నోటితోనూ ప్రత్యర్థికి ఇచ్చిపడేశాడు. బౌలింగ్ సమయంలో కొత్త పేసర్ హర్షిత్ రాణాను మిచెల్ స్టార్క్ టీజ్ చేశాడు. నేను నీ కంటే వేగంగా బౌలింగ్ చేయగలనంటూ రెచ్చగొట్టాడు. దాన్ని గుర్తుపెట్టుకున్న జైస్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో స్టార్క్‌కు ఇచ్చిపడేశాడు. నువ్వు చాలా స్లోగా బౌలింగ్ చేస్తున్నావ్.. బౌలింగ్‌లో పస లేదంటూ కవ్వించాడు. జైస్వాల్ బ్యాటింగ్ టైమ్‌లో ఆసీస్‌కు ఓ రనౌట్ అవకాశం వచ్చింది. ఔట్ అయ్యే ఛాన్స్ లేకపోవడంతో ఫీల్డర్ త్రో ఆపేశాడు. అయితే క్రీజులోకి వస్తున్న జైస్వాల్‌తో కాసేపు ఆడుకుందామని అనుకున్నాడు.


ఫీల్డర్లనూ వదల్లేదు

జైస్వాల్ కూడా ఏమాత్రం తగ్గలేదు. క్రీజులోకి కాలు పెట్టినట్లే పెట్టి వెనక్కి జరగడం, గాల్లోనే కాలును ఉంచి అపోజిషన్ ఫీల్డర్లను రెచ్చగొట్టాడు. ఇన్నింగ్స్ ఆసాంతం భారత ఓపెనర్ ఇలాగే అవకాశం దొరికినప్పుడల్లా అటు బ్యాట్‌తో విజృంభిస్తూనే.. ఆసీస్ ఆటగాళ్ల మీద కామెంట్స్ చేస్తూ వాతావరణాన్ని హీటెక్కించాడు. దీంతో ఆసీస్‌కు కొత్త మొగుడు తయారయ్యాడని.. కోహ్లీ కంటే డేంజరస్‌గా ఉన్నాడు, కంగారూలను వదట్లేదంటూ జైస్వాల్‌ను మెచ్చుకుంటున్నారు. కాగా, రెండో రోజు ముగిసేసరికి భారత్ వికెట్లు కోల్పోకుండా 172 పరుగులు చేసింది. జైస్వాల్ (193 బంతుల్లో 90 నాటౌట్)తో పాటు రాహుల్ (153 బంతుల్లో 62 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. జట్టు ఆధిక్యం 218కి చేరుకుంది.


Also Read:

ఆసీస్‌తో ఆడుకున్న రాహుల్-జైస్వాల్.. ఏం ఆడారు భయ్యా

సచిన్‌ను గుర్తుచేసిన రాహుల్.. చూసేందుకు రెండు కళ్లు చాలవంతే..

స్నేహిత్‌కు కాంస్యం

For More Sports And Telugu News

Updated Date - Nov 23 , 2024 | 05:15 PM