ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: ఐపీఎల్ సీజన్‌కు మ్యాక్స్‌వెల్ బ్రేక్.. ఎందుకంటే..?

ABN, Publish Date - Apr 16 , 2024 | 04:25 PM

ఐపీఎల్ సీజన్ నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటానని మ్యాక్స్‌వెల్ ప్రకటించారు. ఈ సీజన్‌లో మ్యాక్స్ వెల్ నుంచి గొప్ప ఇన్నింగ్స్ రాలేదు. నిన్నటి తుది జట్టులో చోటు లభించలేదు. మ్యాక్స్ వెల్ స్థానంలో విల్ జాక్స్‌ను తీసుకున్నారు. తన స్థానంలో మరొకరిని తీసుకోవాలని కెప్టెన్ డుప్లెసిస్‌‌కు మ్యాక్స్‌వెల్ స్పష్టం చేశారు.

Glenn Maxwell Takes Indefinite Break From IPL 2024

ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్‌కు మంచి ఊపు వచ్చింది. జట్లు బాగా స్కోర్ చేయడం, ప్రత్యర్థి కూడా ఛేజ్ చేయడంతో ఇంట్రెస్టింగ్‌గా మారింది. సాయంత్రం అయ్యిందంటే చాలు క్రికెట్ లవర్స్‌ టీవీలకు అతుక్కుపోతున్నారు. నిన్నటి హైదరాబాద్- బెంగళూర్ మ్యాచ్ చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు బ్యాట్స్ మెన్ గ్లేన్ మ్యాక్స్ వెల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

RCB: దయచేసి ఆర్సీబీని అమ్మిపారేయండి.. టెన్నిస్ దిగ్గజం తీవ్ర అసహనం


ఏంటంటే..?

ఐపీఎల్ సీజన్ నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటానని మ్యాక్స్‌వెల్ ప్రకటించారు. ఈ సీజన్‌లో మ్యాక్స్ వెల్ నుంచి గొప్ప ఇన్నింగ్స్ రాలేదు. నిన్నటి తుది జట్టులో చోటు లభించలేదు. మ్యాక్స్ వెల్ స్థానంలో విల్ జాక్స్‌ను తీసుకున్నారు. తన స్థానంలో మరొకరిని తీసుకోవాలని కెప్టెన్ డుప్లెసిస్‌‌కు మ్యాక్స్‌వెల్ స్పష్టం చేశారు.


కారణమిదేనా..?

‘ప్రస్తుతం నా మానసిక, శారీరక పరిస్థితి ఏం బాగోలేదు. అందుకోసమే కాస్త విరామం తీసుకోవాలని అనుకున్నా. మ్యాచ్ ముగిసిన తర్వాత డుప్లెసిస్, కోచ్‌ని కలిశాను. తన స్థానంలో మరొకరిని తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడే కాదు గతంలో ఒకసారి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నా. ప్రస్తుతం ఐపీఎల్‌‌లో క్రికెట్‌‌కు బ్రేక్ ఇవ్వడం సరైనదని భావిస్తున్నా. మానసికంగా, శారీరకంగా బ్రేక్ ఇవ్వడంతో శరీరం మెరుగుపడుతుంది. తిరిగి సీజన్‌లోకి రావాలంటే పూర్తి ఫిట్‌తో ఉండాలని భావిస్తున్నా అని’ మ్యాక్స్ వెల్ స్పష్టం చేశారు.


నిన్నటి తుది జట్టులో మ్యాక్స్ వెల్ చోటు లభించలేదు. మార్పు చేర్పులు చేశారు. దాంతో మ్యాక్స్ వెల్ హార్ట్ అయి ఉంటారు. అందుకే మానసికంగా బాగోలేదని బ్రేక్ ఇచ్చారని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు.

Virat Kohli: ఏంటీ చెత్త బౌలింగ్.. మైదానంలో కోహ్లీ ఎమోషనల్ మూమెంట్స్ చూశారా? వీడియో వైరల్!

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం

Updated Date - Apr 16 , 2024 | 04:25 PM

Advertising
Advertising