IPL 2024: వెనక్కి వెళ్లు.. రోహిత్ శర్మకు హర్దిక్ పాండ్యా ఆదేశాలు.. ఫ్యాన్స్ ఫైర్
ABN, Publish Date - Mar 25 , 2024 | 01:27 PM
ఐపీఎల్ 2024 ఫస్ట్ మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్ ఓటమితో ప్రారంభించింది. కొత్త కెప్టెన్ హర్ధిక్ పాండ్యా జట్టు సభ్యులను కమాండ్ చేశాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా ఆదేశాలు జారీ చేశాడు. రోహిత్ శర్మను వెనక్కి వెళ్లు అని ఆదేశించాడు. హర్ధిక్ అలా చెప్పడంతో రోహిత్ శర్మ కాస్త ఆశ్చర్య పోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
ఐపీఎల్ 2024 (IPL) ఫస్ట్ మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్ (MI) ఓటమితో ప్రారంభించింది. కొత్త కెప్టెన్ హర్ధిక్ పాండ్యా (Hardik Pandya) జట్టు సభ్యులను కమాండ్ చేశాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు (Rohit Sharma) సైతం ఆదేశాలు జారీ చేశాడు. రోహిత్ శర్మను వెనక్కి వెళ్లు అని ఆదేశించాడు. హర్ధిక్ అలా చెప్పడంతో రోహిత్ శర్మ (Rohit Sharma) ఆశ్చర్య పోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. రోహిత్ శర్మ (Rohit Sharma) నుంచి కెప్టెన్సీ లాక్కున్న పాండ్యా.. ఇప్పుడు తాను చెప్పిన చోట ఫీల్డింగ్ చేయమని చెప్పడంతో అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు.
రోహిత్ అక్కడికి వెళ్లు
చివరి ఓవర్‌లో కొత్త కెప్టెన్ పాండ్యా ఫీల్డింగ్ సెట్ చేశాడు. సాధారణంగా రింగ్ లోపల రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తుంటాడు. స్లిప్, మిడాప్, మిడాన్ మధ్య ఉంటారు. అయితే రోహిత్ శర్మను వెనక్కి వెళ్లు అని పాండ్యా పురమాయించాడు. 30 యార్డ్ సర్కిల్ నుంచి బౌండరీ రోప్ వద్దకు వెళ్లాలని రోహిత్ శర్మకు స్పష్టం చేశాడు. బౌండరీ లైన్ వద్దకు రోహిత్ వెళ్లిన తర్వాత కూడా ప్లేస్ మార్చాడు. రోహిత్‌ను పాండ్యా ఫీల్డింగ్ సెట్ చేయడంతో కొందరు అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. ముంబై కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించడాన్ని ఇప్పటికీ కోపంతో ఉన్నారు. కొత్త కెప్టెన్ ఆదేశాలతో మరింత ఫైర్ అవుతున్నారు. డీప్ ఫీల్డింగ్ చేసిన రోహిత్ శర్మ 8వ ఓవర్‌లో క్యాచ్ పట్టాడు. లాంగ్ ఆన్‌లో శుభ్ మన్ గిల్ కొట్టిన బంతిని పట్టుకున్నాడు.
ఫస్ట్ మ్యాచ్ ఓటమి
సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో ముంబై జట్టు ఓడిపోయింది. స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో విఫలమైంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టును బుమ్రా దెబ్బతీశాడు. 3 వికెట్లు తీయడంతో గుజరాత్ 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి 5 ఓవర్లలో ముంబై జట్టు 43 పరుగులు చేయలేకపోయింది. 32 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి చేతులేత్తెసింది. బౌలింగ్‌లో మార్పులు, 7వ స్థానంలో పాండ్యా బ్యాటింగ్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. మాజీ బౌలర్ ఇర్పాన్ పఠాన్ ఇదే విషయాన్ని ప్రశ్నించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి:
IPL 2024: ముంబై మ్యాచులో ట్విస్ట్.. గుజరాత్ గెలుపునకు వీరే ప్రధాన కారణం
Updated Date - Mar 25 , 2024 | 01:27 PM