Shubman Gill: శుభ్‌మన్ గిల్‌తో పెళ్లి.. స్పందించిన హిందీ నటి రిద్ధిమా పండిట్!
ABN , Publish Date - Jun 01 , 2024 | 08:56 PM
టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్, హిందీ బుల్లితెర నటి రిద్ధిమా పండిట్ ప్రస్తుతం ప్రేమలో ఉన్నారని, వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి డేటింగ్ చేస్తున్న వీరిద్దరూ ఈ ఏడాది డిసెంబర్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఓ వార్త వైరల్ అవుతోంది.
టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill), హిందీ బుల్లితెర నటి రిద్ధిమా పండిట్ (Ridhima Pandit) ప్రస్తుతం ప్రేమలో ఉన్నారని, వీరు త్వరలోనే పెళ్లి (Marriage) చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి డేటింగ్ చేస్తున్న వీరిద్దరూ ఈ ఏడాది డిసెంబర్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఓ వార్త వైరల్ అవుతోంది. చాలా మంది ఈ వార్త నిజమేనని నమ్మి కామెంట్లు చేస్తున్నారు. రిద్ధిమాకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ వార్తపై తాజాగా స్పందించిన రిద్ధిమా క్లారిటీ ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ వీడియో షేర్ చేసి ఆ రూమర్స్‌కు ఫుల్స్టాప్ పెట్టింది. ``ఈ రోజు ఉదయం నాకు తెలిసిన చాలా మంది జర్నలిస్ట్‌లు ఫోన్ చేసి విషెస్ చెప్పారు. నాకు పెళ్లి జరుగుతోందని చెప్పారు. నాకు తెలియకుండానే నేను పెళ్లి చేసుకుంటున్నానా అని డౌట్ వచ్చింది. నిజంగా అలాంటి గుడ్ న్యూస్ ఏదైనా ఉంటే నేనే డైరెక్ట్‌గా చెబుతా. మీరు అనుకుంటున్నది ఏదీ నిజం కాదు. శుభ్‌మన్ గిల్‌తో నాకు వ్యక్తిగత పరిచయమే లేదు. అదంతా ఓ ఫేక్ స్టోరీ`` అని రిద్ధిమా పేర్కొంది.
రిద్దిమా పండిట్ హిందీ బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ కలిగి ఉంది. ఆమె ``బహు మహారీ రజినీకాంత్`` సీరియల్లో ముఖ్య పాత్రలో నటించింది. ``ఖాత్ర ఖాత్ర ఖాత్ర`` అనే షోలో కూడా పాల్గొంది. అలాగే బిగ్‌బాస్ ఓటీటీ తొలి సీజన్లోనూ మెరిసింది.
ఇవి కూడా చదవండి..
T20 Worldcup: స్టేడియంలో రోహిత్, కోహ్లీ భార్యలను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది: సౌరవ్ గంగూలీ
Dinesh Karthik: బయటి వారికి ఇవేవీ తెలియవు.. నా రిటైర్మెంట్ నిర్ణయానికి కారణాలు అవే: దినేష్ కార్తీక్!
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..